- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ల తో పాటు, ఉప సర్పంచ్లను, వార్డు సభ్యులను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తో పాటు, మాజీ ఎమ్మెల్యే సురేందర్, పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, బీడీసీ సభ్యులు సన్మానించారు. పోసానిపేటలో పాలకవర్గాన్ని మాజీ జెడ్పిటిసి మోహన్ రెడ్డి తో పాటు మాజీ సర్పంచ్ కీ రెడ్డి మహేందర్ రెడ్డి, గొల్లపల్లి వార్డ్ మెంబర్ రెడ్డి మల్లేష్ ను మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు, రామారెడ్డి పాలకవర్గాన్ని దళిత సంఘం ఆధ్వర్యంలో శాల్వాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



