నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నూతన సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ లను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. మొదటిసారి పాఠశాలకు విచ్చేసిన సర్పంచ్ దంపతులను ఉదయం అసెంబ్లీ అనంతరం పాఠశాల తరపున ప్రధానోపాధ్యాయురాలు రమా కుమారి శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవడం ద్వారా పాఠశాలకు, ఉపాధ్యాయులకు, కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. పాఠశాల అభివృద్ధికి తమ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని, పాఠశాలలో ఈ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీని ఇచ్చారు.కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగభూషణం, ఉపాధ్యాయ బృందం సభ్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.



