నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలానికి చెందిన డాక్టర్ సత్పాల్ దేవదాస్,డాక్టర్ దానేవార్ గంగాధర్, ఇద్దరూ అర్థశాస్త్ర విభాగంలో పి.హెచ్.డి పట్టా పొందారు. పిహెచ్డి పట్టాలు సాధించిన ఇద్దరి డాక్టర్లకు శుక్రవారం మద్నూర్ మండల తపాస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఉర్దూ హైస్కూల్ లో వారిని ఘనంగా సన్మానించారు. డాక్టరెట్ పొందిన వారిలో దేవదాస్ దన్నూరు గ్రామానికి చెందినవారు. కాగా మరొకరు గంగాధర్ అంతాపూర్ గ్రామానికి చెందినవారు.
ఈ సందర్భంగా తపస్ మండల అధ్యక్షులు పండర్నాథ్, జనరల్ సెక్రెటరీ అజిత్ పవర్ మాట్లాడుతూ.. చిన్న గ్రామం నుండి ఉన్నత విద్య కై వెళ్లి ఉన్నత చదువులు చదివి అర్థశాస్త్ర విభాగంలో పి.హెచ్.డి పట్టా పొందడం మద్నూరు మండలానికి గర్వకారణమని తెలిపారు. తపస్ జిల్లా నాయకులు రచ్చ శివకాంత్ మాట్లాడుతూ ప్రాథమిక విద్య నా వద్ద పూర్తి చేసి ఉన్నత విద్యావంతులు కావడం సంతోషకరంగా ఉందని మా శిష్యులు డాక్టరేట్ సాధించడం ఆనందకరమని అన్నారు.
వీరిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసుకొని విజయ తీరాలకుచేరాలన్నారు. అనంతరం డాక్టరేట్ సాదించిన విద్యార్థులుమాట్లాడుతూ..ఇద్దరం నిరుపేద కార్మిక కుటుంబాలలో జన్మించిఎన్నో ఒడిదుడుకులనుఎదుర్కొని, కష్టపడుతూఇష్టపడుతూఅనుకున్నది సాదించామన్నారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు నాంపల్లి మల్లేశం,టీచర్స్ షాహిని బేగం, షాహిని ఫాతిమా, నవిద్, నస్రీన్, తపస్ నాయకులు గోజే సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.