Tuesday, January 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా స్థాయిలో రాణించిన క్రీడాకారులకు సన్మానం

జిల్లా స్థాయిలో రాణించిన క్రీడాకారులకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నాగాపూర్ లో మంగళవారం జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో రాణించి తృతీయ బహుమతి గెలుపొందిన క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. ఈ మేరకు మంగళవారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాస్థాయిలో తృతీయ బహుమతి గెలుపొందిన క్రీడాకారులు దేశాబోయిన సుమాంజన్, బసకొండ మారుతీ, పాలేపు నంద కిషోర్, అంబళ్ల గౌతమ్, గడ్డం అభిషేక్, బసిరి సాత్విక్, విగ్నేష్, కంపదండీ భేష్మతేజ, బసకొండ శ్రీమాన్,  బట్టు గణేష్ లను కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, సర్పంచ్ కొంపదండి అశోక్ సన్మానించారు.

క్రీడాకారులను శాలువాలతో సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉల్లెంగుల శశిధర్, గడ్డం కార్తీక్, చిడబోయిన మధు, బసిరి సురేష్, బసకొండ దేవేందర్, మామిడి రామాంజనేయులు, డాకూరి ఆనంద్, పాలెపు రాజేశ్వర్, రాకేష్, ఎముగంటి శ్రీనివాస్, జిల్లా చందు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -