నవతెలంగాణ – సారంగాపూర్
నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని డిసిసి అధ్యక్షులు వెల్మ బొజ్జు పటేల్ ఇటీవల ఏర్పాటు చేశారు. జిల్లా అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి గాజుల రవి, కార్యవర్గ సభ్యుడు రాజ్ మహమ్మద్ లు నియమతులయ్యారు. ఈ సందర్భంగా సారంగాపూర్ మండలకేంద్రంలో మార్కెట్ చైర్మన్ అబ్ధుల్ హాది, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు శాలువాలు కప్పి పులుగుచ్చని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కునేరు భూమన్న, నాయకులు నర్సారెడ్డి, నవీన్, మల్లేష్, సాయి, అంబేద్కర్ సంఘ నాయకులు నాగయ్య, శంకర్, ఈశ్వర్, ముత్యం, లక్ష్మన్, మురళి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కాంగ్రెస్ కార్యవర్గానికి నియమితులైన నేతలకు సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



