Saturday, February 28, 2026
E-PAPER
Homeఆదిలాబాద్మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు సన్మానం..

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్ 
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ ల్లో శనివారం ముధోల్ నియోజకవర్గం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన మున్నూర్ కాపు సామాజిక వర్గం చెందిన  ప్రజాప్రతినిధులకు ఘనంగా సన్మానించారు .ఇటీవల ఎన్నికైన ఆయా ప్రాంతాలకు చెందినసర్పంచులకు, ఉపసర్పంచ్ లకు, వార్డు సభ్యులకు, కౌన్సిలర్లు, చైర్మన్లు కార్పొరేటర్లకు సన్మానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముధోల్ నియోజకవర్గ మున్నూర్ కాపు సంఘం అధ్యక్షులు రోళ్ల రమేష్, సంఘం నాయకుల ఆధ్వర్యంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, బైంసా మున్సిపల్ చైర్మన్ టి. దత్తాద్రి కొండల్ వాడి మున్సిపల్ చైర్మన్ కోట్ల గజానంద్ ,నిజామాబాద్ కార్పొరేటర్ బొబ్బిలి వేణు, కౌన్సిలర్లు అల్లం దిలీప్, చింతపండు మహేష్, నిమ్మ ప్రవీణ్, రాజు, హరీష్,పాటు పలువురికి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం  కార్యదర్శి జి రవి, కోశాధికారి సిద్దుల వివేకానంద, సలహాదారులు పిప్పెర కృష్ణ,కోర్వ శ్యామ్, నరసయ్య, గడ్డం సుభాష్ ,లవన్ కుమార్ తో పాటు పెద్ద సంఖ్యలో సంఘం సభ్యులు ,తదితరులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -