- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండల కేంద్రంలో ఆదివారం గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్, ఉప సర్పంచ్ నవీన్, వార్డు సభ్యులను ఆదివారం ఆర్యవైశ్య సంఘం, విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. సంఘాలకు అండగా ఉంటానని, గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వడ్ల లక్ష్మీరాజం, ప్రధాన కార్యదర్శి వడ్ల స్వామి, కోశాధికారి గాయత్రి ప్రసాద్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చీకోటి మురళి, కేదార్ ప్రసాద్, అడ్డగుల్ల శ్రీనివాస్, ఉమాపతి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



