Tuesday, July 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేజీబీవీలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులకు సన్మానం..

కేజీబీవీలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులకు సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల 10వ తరగతి, ఇంటర్లో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులకు మంగళవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేజీబీవీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సువర్ణ 1000 మార్కులకు గాను 958 మార్కులు సాధించింది. సవిత ఎంపీసీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని 1000 మార్కులకు గాను 881 మార్కులు సాధించారు. శ్రావణి బైపిసి ఫస్టియర్ లో 440 మార్కులకు గాను 405 మార్కులు సాధించింది. యు. మహేశ్వరి ఎంపీసీ ఫస్టియర్ 470 మార్కులకు గాను 423 మార్కులు సాధించింది.

అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు కేజీబీవీ గురుకుల పాఠశాల ఉపాధ్యాయినీల బృందం అందరూ కలిసి విద్యార్థులకు ఘనంగా శాలువాతో సన్మానించి జ్ఞాపికలను అందించారు. అనంతరం కేజీబీవీలో ఉపాధ్యాయులు విద్యార్థుల బృందం కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలతో ఉల్లాసంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేజీబీవీ విద్యార్థినిలు  ఉపాధ్యాయినీల బృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -