Wednesday, March 18, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకదం తొక్కిన ఆశాలు

కదం తొక్కిన ఆశాలు

- Advertisement -

కలెక్టరేట్ల ఎదుట 48 గంటల మహా ధర్నా విజయవంతం
పలుచోట్ల ఉద్రిక్తతలు, పోలీసుల లాఠీచార్జి
మహిళలపై పిడిగుద్దులు, తోపులాటలో గాయాలు
రాత్రంతా కలెక్టరేట్ల వద్ద జాగరణ
నవతెలంగాణ -విలేకరులు

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆశాలకు ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18వేలు నిర్ణయిస్తూ ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లో ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలు కదం తొక్కారు. తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ల ఎదుట 48 గంటల మహాధర్నాలు మంగళవారమూ కొనసాగాయి. పెండింగ్‌లో ఉన్న వేతనాలు, పారితోషికాలు చెల్లించాలని నినదించారు. ఈ దీక్షలను భగం చేస్తూ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పలు జిల్లాల్లో ఉద్రిక్తతకు దారి తీసింది. మహిళలని కూడా చూడకుండా పోలీస్‌ బస్సులోకి ఈడ్చుకుంటూ పోతున్న సమయంలో కొందరు ఆశా వర్కర్లకు గాయాలయ్యాయి. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన దీక్షను పోలీసులు భగం చేశారు. మహిళలను పిడిగుద్దులు గుద్దడంతో కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అరుపులు, కేకలతో భయానక వాతావరణంగా మారగా మహిళల గాజులు చిందరవందరగా పగిలి పోయాయి. ఈ క్రమంలో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు పి. జయలక్ష్మిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. హైదరా బాద్‌ డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.
కామారెడ్డి జిల్లాలో కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. రెండు రోజులుగా ధర్నా కొనసాగిస్తున్న ఆశా వర్కర్లను పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. బారికేడ్లను తోసుకుంటూ కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు, ఆశావర్కర్ల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కామారెడ్డికి చెందిన ఆశా వర్కర్‌ సొమ్మసిల్లి పడిపోగా, వెంటనే అంబులెన్సులో ప్రభుత్వా స్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆశా వర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సష్టించినా తమ పోరాటాన్ని ఆపేది లేదని హెచ్చరించారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే తమ సమస్యలకు పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో ఆందోళన ను మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. నిజా మాబాద్‌ జిల్లా కేంద్రంలో బైపాస్‌రోడ్డులోని ఖానాపూర్‌ చౌరస్తా నుంచి కలెక్టరేట్‌ వరకు ఆశా వర్కర్లు మహా ప్రదర్శన చేపట్టారు. అనంతరం అక్కడ బైటాయించి ధర్నా చేపట్టారు. అనంతరం డీఎంహెచ్‌వో రాజశ్రీ ధర్నా స్థలానికి చేరుకుని ఆశా కార్యకర్తల సమస్యలను విన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. కుమురం భీం ఆసిఫాబాద్‌లో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆశాలు చేపట్టిన 48 గంటల దీక్షను మంగళవారం డీఎంహెచ్‌ఓ హామీ మేరకు విరమిం చారు. నిర్మల్‌ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు రోస్తారోకో చేపట్టారు. వికారాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా కొనసాగింది. రాత్రి వర్షంలోనూ పట్టువదల కుండా ఆశావర్కర్లు.. రాత్రంతా జాగారంతో ధర్నా చేసి, అక్కడే వంటావార్పు నిర్వహించారు. మంగళ వారం కలెక్ట రేట్‌ ఎదుట పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం డీఎంఅండ్‌హెచ్‌ఓకు వినతిపత్రం అందజేశారు. నాగర ్‌కర్నూల్‌ జిల్లాకేంద్రంలోని కొల్లాపూర్‌ చౌరస్తా కలెక్టర్‌ కార్యా లయం ముందు ఆశా కార్యకర్తలు ఆందోళన నిర్వహిం చారు. మొదటిరోజు వంటావార్పు చేసి కలెక్టర్‌ కార్యా లయం రాత్రి నిద్రపోయారు. రెండోరోజు కార్యాలయం ముందు ఆందోళన చేశారు. కార్యాలయంలోకి సిబ్బందిని పోనివ్వకుండా అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న ఆశాలను అరెస్టులు చేశారు. నారాయణపేట జిల్లా కలెక్టరేట్‌ మెయిన్‌ గేట్‌ ముందు ధర్నా చేస్తున్న ఆశాలను చూసి దొడ్డిదారిన కలెక్టర్‌ కార్యాలయంలోనికి వెళ్లారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పాత కలెక్టర్‌ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి, అక్కడే భోజనాలు చేసి, ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -