Thursday, April 2, 2026
E-PAPER
Homeబీజినెస్సరికొత్తగా.. సూపర్‌ఫుడ్స్‌తో హార్లిక్స్

సరికొత్తగా.. సూపర్‌ఫుడ్స్‌తో హార్లిక్స్

- Advertisement -

బాదం, ఓట్స్, చిరుధాన్యాలు, మాల్టెడ్ బార్లీ మిశ్రమంతో..
వతెలంగాణ నెల్లూరు: ఇప్పుడు అందరికీ ఆరోగ్యం పట్ల స్పృహ పెరిగింది. అందుకే ఆరోగ్యకర ఆహారానికి‌ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ తరుణంలో హిందుస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్ ‘హార్లిక్స్ సూపర్‌ఫుడ్స్’ను తీసుకొచ్చింది. ఈ సరికొత్త హార్లిక్స్ మాల్టెడ్ బార్లీ, చిరుధాన్యాలు, ఓట్స్, బాదం వంటి సూపర్‌ఫుడ్స్‌ మిశ్రమంతో రూపొందించబడింది. ఈ పదార్థాలు అధిక పోషక విలువలకు, రోజువారీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రసిద్ధి చెందాయి. తరతరాలుగా ప్రాచుర్యం పొందిన హార్లిక్స్ రుచిని అలాగే ఉంచుతూ..‌ పోషక ప్రభావాన్ని పెంచేలా అధునాతన సైన్స్‌ను ఇందులో జోడించింది. ఇందులో ముఖ్యంగా సొంత న్యూట్రీమ్యాక్స్ టెక్నాలజీ. ఐరన్, జింక్ వంటి కీలక ఖనిజాల శక్తిని శరీరానికి అందకుండా అడ్డుపడే ఫైటేట్స్ వంటి యాంటీ-న్యూట్రియెంట్లను తగ్గించడానికి ఈ ప్రత్యేక ప్రక్రియ సహాయపడుతుంది. ఈ అధునాతన ప్రాసెసింగ్ ద్వారా కరిగే, కరగని ఫైబర్ పరిమాణం పెరుగుతుంది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి తోడ్పడటమే కాకుండా శరీరం అవసరమైన పోషకాలను సమర్థవంతంగా గ్రహించేలా చేస్తుంది.

హార్లిక్స్ సూపర్‌ఫుడ్స్ కరిగే డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన సూక్ష్మపోషకాలు, ప్రోటీన్‌తో కూడిన సంపూర్ణ పోషకాహారాన్ని అందిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది పిల్లల్లో అనారోగ్యాన్ని 30 శాతం వరకు తగ్గిస్తుందని క్లినికల్‌గా నిరూపించబడింది. పిల్లలు ఎత్తుగా పెరగడానికి, దృఢమైన ఎముకలను పొందడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఇది తోడ్పడుతుందని నిరూపితమైంది. కొత్త హార్లిక్స్ అదనపు చక్కెర లేని ‘జీరో యాడెడ్ షుగర్’ వేరియంట్‌లో కూడా లభిస్తుంది. ఇందులోని ‘స్మార్ట్ స్వీట్‌నెస్’ టెక్నాలజీ, చక్కెర లేదా కృత్రిమ తీపి పదార్థాలను ఉపయోగించకుండానే, మాల్టెడ్ బార్లీ నుంచి వచ్చే సహజమైన తీపిని పెంచి పాత రుచినే అందిస్తుంది. దీనిని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోకి విస్తరించింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, పోషకాహారానికి ప్రాధాన్యతనిస్తూ దక్షిణ భారతదేశంలో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తోంది.
ఈ సందర్భంగా హిందుస్థాన్ యూనీలీవర్ ఫుడ్స్ అండ్ రిఫ్రెష్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజనీత్ కోహ్లీ మాట్లాడుతూ ఆధునిక జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల పోషకాహార అవసరాలకు, మనం తీసుకునే ఆహారానికి మధ్య అంతరం పెరుగుతుందన్నారు. హార్లిక్స్ సూపర్‌ఫుడ్స్‌తో వినియోగదారులకు ఉపయోగపడేలా, సైన్స్ ఆధారిత పోషకాహారాన్ని అందించడానికి ఒక నమ్మకమైన బ్రాండ్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. సూపర్‌ఫుడ్స్ ప్రయోజనాలను మా సొంత న్యూట్రీమ్యాక్స్ టెక్నాలజీతో కలపడం ద్వారా వినియోగదారులు ఇష్టపడే అదే రుచిని అందిస్తూనే, పోషకాలను శరీరం గ్రహించే సామర్థ్యాన్ని పెంచగలిగామన్నారు. దీనివల్ల అర్థవంతమైన పోషక విలువలను అందిస్తూనే, రోజువారీ అలవాట్లలో సులభంగా భాగమయ్యే ఉత్పత్తిని అందించగలుగుతున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా దక్షిణాసియా యూనీలీవర్ ఫుడ్స్ & బెవరేజెస్ ఆర్&డీ హెడ్ డాక్టర్ సుజాత జయరామన్ మాట్లాడుతూ కొత్త హార్లిక్స్‌తో అందరికీ తెలిసిన రుచిని అధునాతన పోషకాహారంతో అందిస్తున్నామని తెలిపారు. సాధారణంగా కీలక ఖనిజాల లభ్యతను పరిమితం చేసే కారకాలను నియంత్రించడం ద్వారా న్యూట్రీమ్యాక్స్ టెక్నాలజీ పోషకాలు శరీరానికి మెరుగ్గా అందేలా చేస్తుందన్నారు. దీనివల్ల అధిక పోషక విలువలను అందించడమే కాకుండా, రోగనిరోధక శక్తి, పెరుగుదల, మేధో వికాసం వంటి ఆరోగ్య ఫలితాలకు మద్దతు ఇచ్చేలా ఈ ఫార్ములాను రూపొందించామన్నారు. ఇది నేటి వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. హార్లిక్స్ సూపర్‌ఫుడ్స్ క్లాసిక్ మాల్ట్ ఫ్లేవర్‌లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అంతటా రిటైల్ స్టోర్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుందన్నారు. ఇందులో ‘జీరో యాడెడ్ షుగర్’ వేరియంట్ ఎంపిక చేసిన ఛానెళ్లలో అందుబాటులో ఉంటుందని తెలిపారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -