Thursday, April 2, 2026
E-PAPER
Homeక్రైమ్మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -

8 మంది మహిళా కార్మికులు మృతి
జల్నా :
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం జల్నా జిల్లాలో నాగ్‌పుర్‌-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేపై టెంపోను ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మహిళా కార్మికులు మృతి చెందినట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఎక్స్‌ప్రెస్‌వేపై పారిశుధ్య పనులు పూర్తి చేసుకున్న మహిళల బృందం ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో టెంపోలో డ్రైవర్‌తో కలిపి మొత్తం 11 మంది ఉన్నట్టు తెలిపారు.
కాగా, ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే జల్నా పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, సహాయక చర్యల్లో పాల్గొన్నారు. స్థానిక పౌరులు కూడా సహాయక చర్యల్లో పాల్గొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రమాద సమయంలో 7 గురు మహిళలు అక్కడికక్కడే చనిపోయారని, మరోకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టు అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -