Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeసినిమాడార్క్‌ కామెడీతో 'గుర్రం పాపిరెడ్డి'

డార్క్‌ కామెడీతో ‘గుర్రం పాపిరెడ్డి’

- Advertisement -

నరేష్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్‌ వెను సడ్డి, అమర్‌ బురా, జయకాంత్‌ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్‌ కామెడీ కథతో ఇప్పటి వరకు తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్‌ రూపొందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ తమిళ హాస్యనటుడు యోగిబాబు ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు బర్త్‌ డే విషెస్‌ చెబుతూ మేకర్స్‌ ఓ స్పెషల్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ఇందులో ఉడ్రాజు అనే పాత్రలో యోగిబాబు సందడి చేయబోతున్నారు. ఆయన పర్‌ఫార్మెన్స్‌ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. పర్పెక్ట్‌ డార్క్‌ కామెడీ మూవీగా ఇది రూపొందుతోంది. ఈ చిత్రంలో డిఫరెంట్‌గా డిజైన్‌ చేసిన క్యారెక్టర్స్‌ను హైదరాబాద్‌ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో కాంటెంపరరీగా, స్టైలిష్‌గా ప్రెజెంట్‌ చేస్తున్నారు దర్శకుడు మురళీ మనోహర్‌.
బ్రహ్మానందం, యోగి బాబు, రాజ్‌ కుమార్‌ కాసిరెడ్డి, జీవన్‌ కుమార్‌, వంశీధర్‌ కోసిగి, జాన్‌ విజరు, మొట్ట రాజేంద్రన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం – మురళీ మనోహర్‌.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad