Tuesday, March 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విత్తనాల పంపిణీతో రైతులకు ఊరటనిచ్చిన ఉద్యానవన శాఖ

విత్తనాల పంపిణీతో రైతులకు ఊరటనిచ్చిన ఉద్యానవన శాఖ

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించి సాగులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కాటారం గ్రామపంచాయతీ పరిధిలోని అంగడి బజార్ కాలనీలో సోమవారం ఉచిత కూరగాయల విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాటారం ఏఎంసీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…
ప్రస్తుత కాలంలో మార్కెట్లో నకిలీ విత్తనాలు విస్తరిస్తున్న నేపథ్యంలో రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను ఉచితంగా అందిస్తున్నదని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని మంచి దిగుబడులు సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సుమారు వందమంది రైతులు పాల్గొని ఉచితంగా కూరగాయల విత్తనాలను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, భూపెల్లి రాజు, ఆత్మకూరి కుమార్, గంట రాజబాపు, బోడ్డు రాజశేఖర్, మారపాక రాజేంద్రప్రసాద్, రైతులు దుర్గం తిరుపతి, గంట సమ్మయ్య, బొమ్మనా రాజబాపు, సిబ్బంది రాందాస్, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -