Tuesday, September 23, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఉక్కపోత.. కుండపోత

ఉక్కపోత.. కుండపోత

- Advertisement -

హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన
వరదలో కొట్టుకుపోయిన వాహనాలు
ముంపుప్రాంతాల్లో హైడ్రా,జీహెచ్‌ఎంసీ సహాయక చర్యలు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో ఉదయం ఉక్కపోత..సాయంత్రం కుండపోతలా మారింది. సోమవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మేఘావృతమైన ఆకాశంలో మధ్యాహ్నం తరువాత మబ్బులు కమ్ముకున్నాయి. మధ్యా హ్నం 3 తరువాత పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీవర్షం మొదలైంది. మోకాలిలోతు నీళ్లు ప్రవహించటంతో.. పలు ప్రధానమార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇండ ముందు ఉంచిన వాహనాలు మురుగునీటిలో కొట్టుకుపోయాయి. వరద పోటెత్తడంతో వ్యాన్‌ డ్రైవర్‌ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొట్టుకుపోతున్న వ్యాన్‌ను అతి కష్టం మీద డ్రైవర్‌ బయటకు తెచ్చారు. హైదరాబాద్‌లో శ్రీనగర్‌ కాలనీలో 9, ఖైరతాబాద్‌లో 8 సెంటీ సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా రహదారులన్నీ జలమయం అయ్యాయి. పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వర్షపు నీరు చేరటంతో ప్రజలు నానాఅవస్థలు పడుతున్నారు. వరద ప్రాంతాల్లో హైడ్రా, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -