నవతెలంగాణ – ఆలేరు
హైదరాబాద్ వరంగల్ మధ్యన ఆకలికి తీర్చుకుందాం అని ఘట్ కేసర్ హైవేపై గల వందన హోటల్ వచ్చే భోజన ప్రియులరా జాగ్రత్త! మీరు తినే భోజనంలో కాఫీలో పానీయాల్లో ఈగలు, దోమలు, బల్లులు ఏవైనా రావచ్చు. హైదరాబాద్ వరంగల్ మధ్యన వేలాదిమంది నిత్యం రాకపోకలు సాగిస్తూ ఆకలైతే వందన హోటల్ ఉందని అక్కడ పెద్ద సంఖ్యలో హోటల్ లో భోజనం చేయడం గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా ఆకలి తీర్చే హోటల్గా మారింది. కస్టమర్లు రద్దీ పెరగడంతో సూచి శుభ్రత మానేసి ఆదాయం పెంచుకోవడమే దేయంగా హోటల్ యాజమాన్యం ప్రవర్తిస్తుంది. సోమవారం నాడు ఐదు మిత్రులతో కలిసి చేవెళ్ల నుండి ఆలేరు వెళుతున్న సమయంలో ఆకలి తీర్చుకునేందుకు వందన హోటల్ కి పెళ్ళాం అని చెప్పారు. హోటల్లో బిర్యాని ఆర్డర్ ఇచ్చాక 40 నిమిషాలకు బిర్యానీ వచ్చింది. బిరియాని అందరం నాలుగైదు ముద్దలు నోట్లో వేసుకుని తింటుండగా ఒక మిత్రుడు కొమ్మగాని రాజు భోజనం ప్లేట్లు ఈగలు కనబడ్డాయి. ఆ ఈగలు చూడగానే ఆ వ్యక్తి మాకు చెప్పాల్నా వద్దని సంకోచిస్తూ తినడం మానేశాడు. ఎందుకు తింట లేవని మిగతా మిత్రులు ప్రశ్నించగా అప్పుడు ఈగ భోజనంలో వచ్చిందని చెప్పగానే ఆ ఈగను చూసి అందరూ వెంటనే లేచి చేతులు కడుక్కున్నారు.
మేనేజర్ ను పిలిచి విషయం చెబితే వేరే భోజనం పెట్టిస్తారని అంటూ బతిమాలాడు. అయినప్పటికీ మాకు భోజనం అవసరం లేదని మిత్రులు చెప్పారు. మేనేజర్ తో ఇంత నిర్లక్ష్యం ఎందుకని అంటూ హోటల్ ఇలా సప్లై చేస్తే త్వరలోనే హోటల్ పేరు చెడిపోదా అని ప్రశ్నించగా అతడు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలాడు. బయటకి వెళ్ళిపోతుంటే వద్దు సార్ తిరిగి భోజనం పెడతాం బిల్లు అవసరం లేదంటూ ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి అంటూ బతిలాడిన వినకుండా అక్కడి నుండి ఆ మిత్రులందరు వచ్చేశారు.
గతంలో కూడా ఈ హోటల్ పై అనేక ఆరోపణలు వచ్చాయి. కానీ పత్రికల్లో రాలేదు. చిన్న సైజు జిల్ల పురుగులు భోజనలు వచ్చినాయి. పాచిపోయిన చికెన్ని వండుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. హోటల్ టేబుల్ లకు సరిపోను సిబ్బంది లేకుండా తక్కువ మందితో హోటల్ యాజమాన్యం మెయింటైన్ చేస్తున్నారు. మూత్రశాలకు వెళ్తే ముక్కు మూసుకొని పోయాల్సిందే. హోటల్ మంచి పేరు వచ్చేదాకా మంచిగా నడిపించి పేరు రాగానే ఇష్టమున్నట్టుగా క్వాలిటీ తగ్గించి లాభాపేక్ష ద్యేయంగా యాజమాన్యం హోటల్ నిర్వహిస్తుందనే దానికి ఈ రోజు ఈగ రావడం నిదర్శనం. ఘట్ కేసర్ వందన హోటల్ కు వచ్చే భోజనం ప్రియుల్లారా తస్మాత్ జాగ్రత్త మీ ఆరోగ్యం కోసం మాకు ఎదురైన సంఘటన యధావిధిగా మీకు తెలియజేస్తున్నాం. అంటూ కొమ్మగాని రాజు ఆవేదన నవతెలంగాణతో వ్యక్తం చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షణ లేకపోవడం వల్ల హోటల్ యజమాన్యం భయం అనేది లేకుండా ఇలాంటి అనారోగ్యకరమైన ఆహారాన్ని సప్లై చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు వెంటనే హోటల్ పై చర్య తీసుకోవాలని కోరారు.



