Wednesday, February 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హాట్సాఫ్ తల్లి..

హాట్సాఫ్ తల్లి..

- Advertisement -

నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం 
భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం తన బాధ్యతగా గుర్తించిన ఓ కవల పిల్లల తల్లి నగరం నుంచి వచ్చి ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి మూడు నెలలు కూడా కాకునా సుమారు యాభై కిలోమీటర్ల దూరంలోని రాజేంద్రనగర్ నుంచి ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని శేరిగూడ 15వ వార్డులో తన అక్క శివానితో కలిసి వచ్చారు. ఇరువురు కలిసి శేరిగూడలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అదే విధంగా తమ కూతురు నగరంలోని రాజేంద్రనగర్ నుండి ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని శేరిగూడలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్న తరుణంలో వారి తల్లిదండ్రులు సైతం వారికి తోడుగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహకరించారు. 14, 15, 16వ పోలింగ్ స్టేషన్ కేంద్రాల్లో మహిళా ఉద్యోగులే ఎన్నికల సిబ్బంది ఉండటం వల్ల సంధ్య మూడు నెలల చిన్నారులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నందుకు పోలింగ్ కేంద్రానికి రావడం పట్ల మహిళ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఆమెకు ఆమెకు హాట్సాఫ్ తెలిపారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -