Thursday, April 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ సభకు వెళ్లకుండా హౌజ్ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం

గ్రామ సభకు వెళ్లకుండా హౌజ్ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం

- Advertisement -
  • – బీఆర్ఎస్ నాయకుడు బానోతు రాజ్ కుమార్
    నవతెలంగాణ – మల్హర్ రావు
    ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని ఆన్ సాన్ పల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు వెళ్లకుండా తనను హౌజ్ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ నాయకుడు బానోతు రాజ్ కుమార్ అలియాసిస్ ఢిల్లీ రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహిస్తున్న నేపథ్యంలో తాను గ్రామసభకు వెళుతున్న క్రమంలో అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం,అధికారులు మాత్రం  గ్రామసభకు అన్నివర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలనీ సందేశం ఇచ్చారని తెలిపారు.
  • తాను అందరిలా గ్రామసభకు వస్తున్న నేపథ్యంలో కొయ్యురు పోలీసులు వచ్చి నీవు పోలీస్  స్టేషన్ కి వచ్చి సంతకం చేసి రావాలి అంటూ మాట్లాడారని,తాను మా గ్రామంలో జరిగే గ్రామసభకు వెళ్లాలని చెప్పినా వినకుండా,మాకు మా పై అధికారుల నుంచి అదేశాలున్నాయి అంటూ,గ్రామసభకు హాజరు కావొద్దని తెలిపినట్లుగా పేర్కొన్నారు.తనను బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించి గ్రామసభ అయ్యాక వదిలిపెట్టినట్లుగా తెలిపారు. తన అక్రమ అరెస్ట్ను పూర్తిగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు. పంచాయతీరాజ్ చట్టంలో ఇలాంటి అక్రమ అరెస్టులు చేయవచ్చని ప్రశ్నించారు. తనకు గ్రామ సమస్యలు అడిగే హక్కు లేదని నిలదీశారు. అక్రమ అరెస్టులతో ప్రశ్నించే గొంతును ఇంకా ఎన్నిరోజులు నొక్కుతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్ కుమార్ అక్రమ అరెస్ట్ కు మద్దతుగా బిఆర్ఎస్ నాయకులు నిరసన,ఆందోళన చెరపట్టారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -