నిరుపేద కుటుంబానికి బియ్యం అందజేత..
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో అకాల వర్షాలకు నిరుపేద కుటుంబమైన మేకల భాగ్య ఇల్లు కూలిపోవడంతో వారికి కాంగ్రెస్ పార్టీ తరపున ఆర్థిక సహాయం చేయడం జరిగినదని మాజీ ఎంపీపీ మచ్చ శంకరయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండో లిస్టులో ఇందిరమ్మ ఇల్లు పెట్టిస్తామని భరోసా ఇవ్వడం జరిగినదన్నారు. ఇల్లు కూలిపోవడంతో నిరాశ్రయులైన వారికి 25 కిలోల బియ్యం, అందజేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ గోపిచంద్ నాయక్, కిష్టాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవింద నాయక్ ఉపాధ్యక్షులు వాసాల భాస్కర్ జనరల్ సెక్రెటరీ మూగల సుధాకర్ జాయింట్ సెక్రెటరీ రేణిగుంట బాపూరావు కోశాధికారి బండారి వినయ సాగర్ నాయకులు గంగారపు మల్లేష్ చిందం లచ్చన్న మేకల కొమురయ్య కొప్పుల రాము మూగల పద్మారావు తదితరులు పాల్గొన్నారు.
వర్షానికి కూలిన ఇల్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES