నవతెలంగాణ – తంగళ్ళపల్లి : గాలి దుమారంతో కూడిన అకాల వర్షం రావడంతో ఇల్లు కూలిపోయింది. తంగళ్ళపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం పలుచోట్ల గాలి దుమారంతో కూడిన అకాల వర్షం పలు గ్రామాల్లో పడింది. జిల్లెల్ల గ్రామానికి చెందిన ఆకారపు రాజయ్యకు చెందిన ఇల్లు గాలి దుమారానికి ఒక్కసారి ఆ పైకప్పు లేచి ఇల్లు వెనుక భాగంలో పడింది. ఈదురు గాలులు బాగా వీయడంతో ఇంటి పైకప్పు లేచి ఇల్లు కూలిపోయిందని బాధితుడు రాజయ్య తెలిపారు. దీంతో ఆ వర్షానికి ఇంట్లో సామానంత తడిసి ముద్దయ్యాయి. కుటుంబ సభ్యులు కాస్త పక్కింట్లో తలదాచుకున్నారు. రాజయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఈదురు గాలులతో కూడుకున్న వర్షం రావడంతో మండలంలోని పలు గ్రామాల్లో మామిడి తోటల్లో మామిడి కాయలు నేల రాలాయి.
ఈదురుగాలులకు కూలిన ఇల్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES