Monday, April 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవెలుగుమట్ల బాధితులందరికీ ఇండ్లస్థలాలివ్వాలి

వెలుగుమట్ల బాధితులందరికీ ఇండ్లస్థలాలివ్వాలి

- Advertisement -

8న ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా
సీపీఐ(ఎం-ఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూ బాధితులందరికీ న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 8న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు సీపీఐ (ఎం-ఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ మేరకు ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి పి సూర్యం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వెలుగుమట్లలో దశాబ్ద కాలానికి పైగా నిరుపేదలు, పేదలు నివాసముంటున్నారని తెలిపారు. భూదాన భూముల్లో నిరుపేదలు, పేదలు వేసుకున్న గుడిసెలను ప్రభుత్వం పాశవికంగా కూల్చేసిందని పేర్కొన్నారు. దీనిపై తీవ్ర నిరసన రావడంతో రాష్ట్ర ప్రభుత్వం 400 మందికి కూల్చిన చోటనే పట్టాలిుచ్చి, ఇండ్లు కట్టిస్తామని చెప్పిందని తెలిపారు. మరి కొంతమందిని విస్మరించిందని గుర్తు చేశారు. అందరికీ ఇండ్ల స్థలాలిచ్చి, ఇండ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -