నవతెలంగాణ – ఆర్మూర్ : పట్టణంలోని 15వ వార్డులో కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థి లహరి రఘుతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు ఆర్మూర్ పట్టణం బాగా అభివృద్ధిలో వెనుకబడి పోయింది. మాజీ ఎమ్మెల్యే గాని తాజా బీజేపీ ఎమ్మెల్యే బి రాకేష్ రెడ్డిగాని మాటలతో నియోజకవర్గ ప్రజలను మభ్య పెడుతూ వస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ ప్రకటించింది.
అన్ని గ్యారెంటీలను నెరవేర్చింది. మహిళలకు ఉచిత బస్సు పథకం గాని రేషన్ లో సన్న బియ్యంగాని ఉచిత విద్యుత్తుగాని ఇలా ఎన్నింటినో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చి అట్టడుగు నా ఉన్న అణగారిన వర్గాల ప్రజలకు పథకాలను చేరువచేసింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన ఘనవిజయం అందువల్ల చేతి గుర్తుకి ఓటెయ్యాలని 15 వార్డుగాని నియోజకవర్గాన్ని గాని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని ప్రజల సాక్షిగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు వార్డు కాంగ్రెస్ నేతలు మహిళా కార్యకర్తలు ప్రజలు భారీగా పాల్గొన్నారు.



