Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఇందిరమ్మ మోడల్‌ హౌస్‌ ప్రకారమే ఇండ్ల నిర్మాణాలు

ఇందిరమ్మ మోడల్‌ హౌస్‌ ప్రకారమే ఇండ్ల నిర్మాణాలు

- Advertisement -

– లబ్దిదారులు ఆర్థిక భారాన్ని పెంచుకోవద్దు : హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వీపీ గౌతమ్‌
నవతెలంగాణ – జనగామ కలెక్టరేట్‌

ఇందిరమ్మ ఇండ్ల్ల నిర్మాణ పనులు వేగమంతమయ్యేలా చూడాలని హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వీపీ గౌతమ్‌ అన్నారు. జనగామ జిల్లాలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని, అలాగే క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలను సోమవారం ఎండీ పరిశీలించారు. ముందుగా నిడిగొండ గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి లబ్దిదారులతో మాట్లాడారు. ఇండ్లను ఎప్పుడు ప్రారంభించారు, ఇసుక, మొరం తదితర విషయాల్లో ఏమైన సమస్యలు ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు. లబ్దిదారులకు ఆర్థిక భారం తగ్గాలంటే, నిబంధనల ప్రకారమే ఇండ్ల నిర్మాణాలు జరగాలని సూచించారు. ఇందిరమ్మ మోడల్‌ హౌస్‌ ప్రకారమే ఇండ్ల నిర్మాణాలు జరిగేలా అధికారులు చూడాలని, తద్వారా లబ్దిదారులకు ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు. అనంతరం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌తో కలిసి ఎంపీడీఓ, హౌసింగ్‌ ఏఈతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల పురోగతి పైన, క్షేత్ర స్థాయిలో సమస్యలేమైనా ఉన్నాయా అని ఎండీ వీపీ గౌతమ్‌ సమీక్ష చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 5745 ఇండ్లు మంజూరు కాగా.. 4560 ఇండ్లు గ్రౌండింగ్‌ అయ్యాయని, 1999 బెస్మెంట్‌ లెవల్‌, 274 రూఫ్‌ లెవల్‌, 166 స్లాబ్‌ లెవల్‌ వరకు నిర్మాణం అయ్యాయని తెలిపారు. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో సందర్శిస్తూ ఇసుక, కంకర తదితర మెటీరియల్‌ విషయంలో లబ్దిదారులు ఇబ్బంది పడకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎండీ వీపీ గౌతమ్‌ మాట్లాడుతూ.. హౌసింగ్‌ అధికారులు తహసీల్దార్‌, ఎంపీడీవోతో సమన్వయం చేసుకుంటూ ఉచితంగా ఇసుక టోకెన్లు అందిస్తూ పురోగతిని సమీక్షించాలన్నారు. కంకర, ఐరన్‌, సిమెంటు, ఇటుకలు ఇతర సామగ్రి నిర్ణిత ధరలకే అందించేలా మండల స్థాయి ధరల నియంత్రణ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. మేస్త్రీలు కూడా నిర్ధారిత రుసుమును మాత్రమే తీసుకునేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు.
లబ్దిదారుల ఆధార్‌ నెంబర్‌ కు లింకయిన బ్యాంక్‌ ఖాతాలోకి దశల వారీగా బిల్లు మొత్తం జమవుతుందని తెలిపారు. సిబ్బంది కొరత సమస్యను ఎండీ దృష్టికి తీసుకెళ్లగా ప్రతి 500 ఇండ్లకి ఒక ఏఈ ఉండేలా త్వరలోనే కేటాయిస్తామని అన్నారు. కలెక్టరేట్‌కు వచ్చిన ఎండీ ముందుగా ప్రవేశంలో ఉన్న ఫోటో గ్యాలరీని సందర్శించి జిల్లాకు సంబందించిన అన్ని రకాల సమాచారాన్ని ఫోటోల రూపంలో చక్కగా పెట్టారని అభినందించారు. ఈ సమావేశంలో హౌసింగ్‌ పీడీ మాతృ నాయక్‌, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఏఈలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img