Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుగాలివానతో కూలీన ఇండ్లు.. పరామర్శ 

గాలివానతో కూలీన ఇండ్లు.. పరామర్శ 

- Advertisement -

అభయ హస్తం కాలనీ ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి
కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్యాల గోవర్ధన్
నవతెలంగాణ – కంఠేశ్వర్
: నిజామాబాద్ నగరంలో నిన్న రాత్రి గాలివానకు ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. ఇందులో భాగంగా బాధిత కుటుంబాలను కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్, అభయ హస్తం కాలనీ అధ్యక్షులు ద్యారంగుల కృష్ణ ల ఆధ్వర్యంలో మంగళవారం పరమర్శించారు. అభయ కాలనీలో గాలివానకు అనేక నిరుపేదల ఇండ్లు నేల మట్టం కావడంతో ప్రజలు నిరాష్రాయులు అయ్యారు, వారిని పరామర్శించి మనోధైర్యం కల్పించారు. గతంలో అభయ హస్తం కాలనీ అభివృద్ధి కోసం మహ్మద్ షబ్బీర్ అలీ 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారని, అదేవిధంగా ప్రజలందరికీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి మోడల్ కాలనీగా మారుస్తామని హామీ ఇచ్చారు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని టీపీసీసీఅధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కి, జిల్లా కలెక్టర్ కి విన్నవించడం జరిగిందని అన్నారు.గాలి వానతో జరిగిన నష్టాన్ని నేతల దృష్టికి తీసుకువెళ్లి, త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలాగా కృషి చేస్తామని, కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఎల్లవేళలా మీకు అండగా ఉంటుందని, అధైర్య పడవద్దని ప్రజలకు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి, నర్సింగ్, ఆకాష్, షేరు, అనిల్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad