Thursday, May 15, 2025
Homeతెలంగాణ రౌండప్అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు..

అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు..

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి : జక్రాన్ పల్లి  మండలం తొర్లికొండ గ్రామంలోని 39 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినటువంటి పత్రాలను కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. ప్రియతమ నాయకుడు  శ్రీ డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉంటామని లబ్ధిదారు సంతోషం వ్యక్తం చేశారు. సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ .. గత ప్రభుత్వాలు మా నిరుపేదలను ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇల్లు ఇచ్చినందుకు ఈ ప్రభుత్వానికి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటాం అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రోసిడింగ్  కాఫీలు అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ  స్పెషల్ ఆఫీసర్  శ్రీనివాస్  గ్రామపంచాయతీ సెక్రెటరీ రాజేశ్వర్, ఆర్మూర్ మార్కెట్ కమిటీ  డైరెక్టర్ కనక రవి ,మండల ఉపాధ్యక్షులు ఉత్కామ్ శ్రీనివాస్ గౌడ్, యువజన ఉపాధ్యక్షులు అనుపాల కిరణ్  , నర్సారెడ్డి,  గంగారెడ్డి, గ్రామ ఉపాధ్యక్షుడు  తాజూద్దీన్, సాయి రెడ్డి, గంగారెడ్డి ,జై గంగారం  గ్రామ యువజన సంఘాల నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -