– కూల్చినవాటికి నష్టపరిహారం చెల్లించాలి
– ఖమ్మంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన సభ
నవతెలంగాణ -ఖమ్మం
ఖమ్మం వెలుగుమట్లలో 2013 నుంచి ఇండ్లు నిర్మించుకుని నివాసముంటున్న ప్రజలపై ప్రభుత్వం దాడి చేసి ఇండ్లను నేలమట్టం చేశారని, నిర్వాసితులుగా మారి సర్వం కోల్పోయారని, వారందరికీ వెలుగుమట్ల భూదాన్ భూముల్లోనే ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇవ్వాలని, కూల్చివేతల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మంలోని అంబేద్కర్ భవనంలో వెలుగుమట్ల భూదాన్ ఇండ్ల నిర్వాసితులకు మద్దతుగా సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్.నవీన్‌రెడ్డి అధ్యక్షతన నిరసన సభ జరిగింది. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. భూదాన్ భూముల్లో వెలుగుమట్ల ప్రాంతంలో పేద ప్రజలు 2013 సంవత్సరం నుంచి గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారన్నారు. ప్రభుత్వ భూమి కనుక ప్రభుత్వమే వారికి మౌలిక వసతులు కల్పించి పట్టాలు అందజేసి ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున అందించాల్సింది పోయి అర్ధాంతరంగా, అక్రమంగా, దుర్మార్గంగా గత నెల 24వ తేదీన అర్ధరాత్రి వేలాది మంది పోలీసులతో, రెవెన్యూ అధికారులతో ఉన్నపళంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హెచ్చరికలు లేకుండా బుల్డోజర్లతో వారి ఇండ్లను నేలమట్టం చేసి నిర్వాసితులుగా మార్చడం దుర్మార్గపు చర్య అని అన్నారు.
వెలుగుమట్లలోని పట్టాల వాళ్ళని వేరే ప్రాంతాలకు కేటాయిస్తే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మెరుగు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌కే మీరా, ఎంఏ జబ్బార్, దొంగల తిరుపతిరావు, బండారు రమేష్, మెరుగు రమణ, నందిపాటి మనోహర్, 35వ డివిజన్ కార్పొరేటర్ ఎల్లంపల్లి వెంకటరావు, వన్ టౌన్, టూ టౌన్, అర్బన్ కార్యదర్శులు ఎస్కే నాగుల్ మీరా, బోడబట్ల సుదర్శన్, బత్తిని ఉపేందర్, నాయకులు ఎస్‌కే మెహరున్నిసా బేగం, భాగం అజిత, అమరావతి, కూరపాటి శ్రీను, కూచిపూడి నరేష్, వీరభద్రం, బడే మియా, గుమ్మడి బిక్షం పాల్గొన్నారు.
‘వెలుగుమట్ల’లో పేదలకు ఇండ్లు కట్టించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



