Saturday, October 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఒక్క ఓటు ఉన్న బీసీలకు టికెట్‌ ఎలా?

ఒక్క ఓటు ఉన్న బీసీలకు టికెట్‌ ఎలా?

- Advertisement -

మా తండాలో రిజర్వేషన్‌ మార్చాలి
లేకుంటే ఎన్నికలను బహిష్కరిస్తాం : కూసుమంచి మండలం ధర్మతండాలో గిరిజనుల నిరసన


నవతెలంగాణ-కూసుమంచి

మా తండా స్థానిక సంస్థల రిజర్వేషన్‌ మార్చి గిరిజనులకే రిజర్వ్‌ చేయాలని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మ తండా గ్రామంలో గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మ తండా గ్రామపంచాయతీ బీసీలకు రిజర్వ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. తండాలో అందరూ గిరిజనులే ఉన్నామని, ఒక్క ఓటు ఉన్న బీసీకి ఎలా రిజర్వ్‌ చేస్తారని ప్రశ్నించారు. ఉన్న ఆ ఒక్క బీసీ వ్యక్తి కూడా వేరే ఊరిలో ఉంటున్నాడని తెలిపారు. దీన్ని తక్షణమే మార్చి లంబాడీ బిడ్డకు కేటాయించాలని, లేనిమెడల హైకోర్టుకు వెళ్లి రిజర్వేషన్‌ సాధిస్తామని చెప్పారు. దీనిపై స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క వెంటనే స్పందించి న్యాయం చేయకపోతే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు బహిష్కరిస్తామని తండావాసులు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -