Thursday, January 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇసుక ఇవ్వక పోతే ఇల్లు ఎలా కట్టేది..

ఇసుక ఇవ్వక పోతే ఇల్లు ఎలా కట్టేది..

- Advertisement -

ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఇవ్వండి 
లబ్ధిదారుల నిరసన 
నవతెలంగాణ – బీర్కూర్ (నసురుల్లాబాద్) 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఇవ్వకపోతే ఇండ్లు ఎలా కట్టుకోవాలంటూ అధికారులు ఆందోళన చేపట్టారు. గురువారం బీర్కూరు మండలం బరంగెడ్గి గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక అనుమతులు ఇవ్వాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

నిరసనకారులతో తహసిల్దార్ సవాయి సింగ్ పిలిపించుకొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ లబ్ధిదారులు మాట్లాడుతూ.. రెండు నెలల నుంచి ఇసుక అనుమతులు ఇవ్వకపోవడంతో తమ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయని తహసీల్దార్ సవాయిసింగ్ దృష్టికి తీసుకొచ్చారు. బరంగెడ్గి గ్రామ శివారు పక్కనే మంజీరా నది ఉందని తమ గ్రామం నుంచి ఇసుక అనుమతులు ఇవ్వాలని సర్పంచి అనిల్ కుమార్ కోరారు. ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి వినతి పత్రం తీసుకొని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ లబ్ధిదారులకు హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు శాంతించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -