Wednesday, July 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుDogs : వీధి కుక్కల బెడద తీరేదెలా..?

Dogs : వీధి కుక్కల బెడద తీరేదెలా..?

- Advertisement -









– భయం గుప్పెట్లో జనాలు- కుక్కల నివారణ చర్యలు చేపట్టాలి

గ్రామస్తులు విజ్ఞప్తి

నవతెలంగాణ మద్నూర్: మద్నూర్ మండల కేంద్రంలో ఏ గల్లిలో చూసిన కుక్కలు మందలు మందలుగా సంచరిస్తున్నాయి. కుక్కల బెడద అధికంగా కావడం జనాలంతా భయం భయంగా తిరగవలసిన దుస్థితి ఏర్పడింది. ఎందుకంటే మండల కేంద్రంలో పిచ్చి కుక్కల దాడులతో జనాలు పలుమార్లు తీవ్ర గాయాల పాలవుతున్నారు.

రెండు రోజుల క్రితం ఒక పిచ్చి కుక్క స్వైర విహారంతో 9 మందిని తీవ్రంగా గాయపరిచింది. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతున్న కుక్కల నివారణ చర్యలు చేపట్టకపోవడం మండల కేంద్రంలో వందల సంఖ్యలో కుక్కలు సంచరిస్తున్నాయి.

గ్రామపంచాయతీ అధికారులు కుక్కల నివారణ చర్యలు చేపట్టడం లేదని ఆరోపణలు గ్రామస్తుల్లో వ్యక్తం అవుతున్నాయి. రోజురోజుకు పెరిగే కుక్కలు బెడద మూలంగా భయం గుప్పెట్లో ప్రజలు తిరగవలసిన దుస్థితి నెలకొంది. పిచ్చి కుక్కలు ఎప్పుడు దాడులు చేసినా ఐదు పది మందికి గాయాల పాలు చేస్తున్నాయి.

ఇలాంటి ఘటనలు పంచాయతీ అధికారుల దృష్టిలో ఉన్నప్పటికీ కుక్కల నివారణ చర్యలు చేపట్టకపోవడం గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ప్రాణాలకు ముప్పు వాటిల్లే విధంగా పిచ్చికుక్కల దాడిలో గాయాల పాలు కావలసి వస్తుంది. రెండు రోజుల క్రితం బేబీ, అస్లాం, అనే ఇద్దరికీ పిచ్చికుక్క తీవ్రంగా గాయపరచడంతో వారిని నిజామాబాద్ ఆసుపత్రికి స్థానిక ఆసుపత్రి సిబ్బంది రెఫర్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగక మునిపే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి కుక్కల బెడదను నివారించాలని గ్రామస్తులు పంచాయితీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.











- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -