ఎంపీ చామల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ఆయన కుటుంబ సభ్యులు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. లేకపోతే వారికి అన్ని ఆస్తులెలా వస్తాయని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితో కలిసి చామల మాట్లాడారు. కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీశ్‌రావు, కవితకు ఫామ్‌హౌస్‌లున్నాయని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి వాస్తవాలను మరిచి.. ఇప్పుడు బీఆర్‌ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించటం విడ్డూరంగా ఉందన్నారు. సీఎంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పూర్తి అసంబద్ధమైనవని కొట్టిపారేశారు. గులాబీ పార్టీ అసెంబ్లీతో సహా అన్ని ఎన్నికల్లో ఓడిపోవటంతో కేటీఆర్‌కు ఏం చేయాలో అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు. అందుకే తమ ప్రభుత్వంపై ఇష్టానుసారంగా విమర్శలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం ఇప్పటికీ చెక్కుచెదరలేదని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నాలుగు రోజులకే కుప్పకూలిందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కుటుంబానికి అన్ని ఆస్తులెలా వచ్చాయి?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



