– బకాయిలు చెల్లించకపోతే లక్షల మంది విద్యార్థులతో ప్రజా భవన్ ముట్టడిస్తాం..
– బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు..
నవతెలంగాణ – కామారెడ్డి
రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే లక్షల మంది విద్యార్థులతో ప్రజా భవన్ ముట్టడిస్తాం అని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. రాష్ట్రంలో సుమారు పదివేల కోట్ల బోధనా రుసుముల బకాయిలు ఉన్నాయని, గత 4 సంవత్సరాలుగా నిర్ణీత సమయానికి స్కాలర్షిప్పు,ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. డిగ్రీ,ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ తదితర కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు పై చదువుల, ఉద్యోగాల నిమిత్తం సర్టిఫికెట్ల కోసం కళాశాలలకు వెళ్తే ఫీజు బకాయిలు రానందున, విద్యార్థులే చెల్లించి తమ సర్టిఫికెట్లను తీసుకెళ్లాలనే షరతులు విధిస్తున్నారని తెలిపారు.
ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడం వల్ల కళాశాలలు నడపలేక పోతున్నామని, అధ్యాపకులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని కాలేజీ యాజమాన్యాలు వాపోతున్నాయని అన్నారు. ఈ నెల 15 నుండి వృత్తి విద్యాసంస్థలు,16 నుండి డిగ్రీ, పీజీ కళాశాలలు నిరవధికంగా బంధు చేస్తామని ప్రకటించడం వల్ల విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. బకాయిల్ని ఒకేసారి కాకున్నా దశలవారీగా ఐనా విడుదల చేసి కళాశాలలకు భారాన్ని తగ్గించి, విద్యార్థుల భవిష్యత్త్ ఆగమ్య గోచరం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. లేని పక్షంలో రాష్ట్రంలోని లక్షల మంది విద్యార్థులతో ప్రజాభవన్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.దయాకర్, రవికృష్ణ, మోహన్, రాజేందర్, శ్రీధర్, వినయ్, ప్రకాష్, సురేందర్, ప్రభంజన్ తదితరులు పాల్గొన్నారు.
రీయంబర్స్మెంట్ కోసం ఎన్నాళ్లీ నిరీక్షణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES