Monday, December 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలుస్టార్‌లింక్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధర ఎంతంటే?

స్టార్‌లింక్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధర ఎంతంటే?

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ స్టార్‌లింక్‌ భారత్‌లో కమర్షియల్‌ సేవలు అందించేందుకు సిద్ధమైంది. రెసిడెన్షియల్‌ కస్టమర్లకు నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ధరను రూ.8,600గా, హార్డ్‌వేర్‌ ధరను రూ.34 వేలుగా నిర్ణయించింది. ఈ ప్లాన్‌లో అపరిమిత డేటా లభిస్తుందని, 30 రోజుల పాటు ఉచిత ట్రయల్‌ను ఆస్వాదించవచ్చని స్టార్‌లింక్‌ తెలిపింది. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ సేవలు నిరంతరాయంగా పనిచేస్తాయని, ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో డివైజ్‌ను రూపొందించినట్లు పేర్కొంది. అయితే, సేవల వేగం, బిజినెస్‌ సబ్‌స్క్రిప్షన్‌ వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -