ఇటీవల కాలంలో మార్కెట్లో కల్తీ ఆహారపదార్థాలు బాగా పెరిగిపోయాయి. నిత్యావసర సరుకులను ఎక్కువగా కల్తీ చేస్తున్నారు. అసలు టమాటోల్లో కల్తీ ఎలా జరుగుతుంది? వాటిని ఏం చేస్తున్నారు. మార్కెట్లో కల్తీ టమాటోలను ఎలా గుర్తించాలి అనే విషయాలు తెలుసుకుందాం!
టొమాటోలను కల్తీ చేయడానికి వాడే ఆ రసాయనాలను సాధారణంగా వాటిని త్వరగా పక్వానికి వచ్చేలా చేయడం లేదా మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేసేందుకు వాడతారు. కాల్షియం కార్బైడ్ లేదా ఇథిలీన్ అనే రసాయనాలను కాయలు త్వరగా పక్వానికి వచ్చేలా చేసేందుకు వాడతారు. దీని వలన పలురకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
టమాటోలు పక్వానికి వచ్చేలా చేసే ఈ కెమికల్స్ తో పాటు, వాటిపై ఒక వాక్స్ వంటి సన్నని పొరను కూడా రుద్దుతున్నారు. దీని వలన ఆ పండ్లు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి, అందులో తేమ తగ్గిపోదు. ఇలా చేయడం వలన టమాటోల పైభాగంలో ఏవైనా దుమ్ము, దూళీతో పాటు విషపూరితమైన పదార్థాలు ఉన్నట్లయితే వాటిని తొలగించడం కష్టమవుతుంది.
ఈ రకమైన రసాయనాలు వాడిన టమాటోలను తినడం వలన హార్మోన్ల అసమతుల్యత, అవయవాలు దెబ్బతినడంతో పాటు పలు ఆరోగ్య సమస్యలు రావచ్చు. రెగ్యులర్‌గా కల్తీ చేసిన టమాటోలను తినడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.
కల్తీ టమాటోలను గుర్తించండిలా!
మార్కెట్లోని కల్తీ టమాటోలను గుర్తించే 5 సింపుల్ టెస్ట్‌లను గురించి తెలుసుకుందాం!
1. నీళ్లలో వేసి పరీక్షించడం : ఒక గిన్నెలో నీళ్లుపోసి అందులో ఒక టమాటోను వేయాలి. నేచురల్‌గా పండినటువంటి టమాటోలు మునిగిపోయి అడుగుకు చేరుకుంటాయి. కల్తీ టమాటో నీటిపై తేలుతుంది
2. కోసి చూడడం ద్వారా తెలుసుకోవచ్చు : టమాటోలను కోసి లోపలి భాగాలను చూస్తే, కత్రిమంగా పండించినటువంటి టమాటో రంగు వేరుగా ఉంటుంది. బయటికి ఎరుపు రంగులో, లోపలి భాగంలో పచ్చగా కనిపిస్తుంది. నేచరల్‌గా పండినటువంటి టమాటోలు అంతా ఒకే రంగులో కనిపిస్తాయి.
3. టమాటో పై పొర : నేచురల్‌గా పండిన టమాటోల పై పొర కాస్త సున్నితంగా ఉంటుంది,సులభంగా చిరిగిపోతుంది. కత్రిమంగా పండినటువంటి టమాటోల పై పొర ధడంగా ఉంటుంది.
4. టమాటోలోని గింజలు : టమాటోలో గింజలు పరిశీలించి చూసినట్లయితే, గింజలు పూర్తిగా ఏర్పడి ఉంటాయి. కత్రిమంగా పండిన టమాటోలో గింజలు పూర్తిగా ఏర్పడవు,తెలుపు రంగులో కనిపిస్తాయి.
5. వాసన చూడటం ద్వారా : నేచురల్‌గా పండినటువంటి టమాటోలు ప్రత్యేకమైన, సహజమైన వాసనను కలిగి ఉంటాయి. రసాయనాలు వాడినటువంటి టమాటోలు కెమికల్ వాసనను కలిగి ఉంటాయి.
కల్తీ గుర్తించడమెలా?
- Advertisement -
- Advertisement -