Sunday, October 12, 2025
E-PAPER
Homeసోపతివ్యక్తిత్వం ఎలా పెంపొందించుకోవాలి?

వ్యక్తిత్వం ఎలా పెంపొందించుకోవాలి?

- Advertisement -

ఒక వ్యక్తి వ్యక్తిగత జీవిత సారానికి వ్యక్తిత్వం గీటురాయి. ఎంత గొప్ప వ్యక్తి, విద్యావేత్త అయినా వ్యక్తిత్వం లేకపోతే జీవితంలో విఫలమవుతాడు. అంటే వ్యక్తిత్వం అంత కీలకమైనదన్నమాట. వ్యక్తి వ్యక్తిగతమైన, వత్తిపరమైన జీవితాన్ని సన్మార్గంలోకి నడిపించేది వారి వ్యక్తిత్వమే.
మంచి వ్యక్తిత్వం వున్నవారిని సమాజం గౌరవిస్తుంది. అలాంటి ఉన్నత వ్యక్తిత్వాన్ని స్కూలు స్థాయి నుంచే అలవరచుకోవాలి. అందరిలో మంచి అనిపించుకునేలా ప్రవర్తించాలి. మీలో ప్రవర్తనా లోపాలు వుండవచ్చు. ముందుగా వాటిని అధిగమించండి. అందరికి తోడ్పడే తత్వాన్ని పెంచుకోవాలి. ఇతరులను మీతో సమానంగా ఆదరించడం ఎంతో మంచి లక్షణం. అప్పుడే మంచి స్నేహితులు ఏర్పడతారు. టీచర్ల నుంచి అవసరమైన మద్దతు లభిస్తుంది. ఎవరు ఎలాంటివారు అన్నది కాకుండా ఎవరికి మీరు ఎంతగా సాయపడగలరో ఆలోచించండి. చదువు విషయంలోనే కాదు, బయట కూడా అందర్నీ గౌరవించాలి. పెద్దల మాట వినాలి. సహాయపడాలి.
వ్యక్తిత్వాన్ని నియంత్రించే అంశాలు కొన్ని:
– మాట తీరు
– నడక తీరు
– దుస్తులు ధరించే తీరు
– భోజనం విధానం
– భావోద్వేగాలు పంచుకునే విధానం
– చిన్నపాటి సంఘటనలూ సందర్భాలపట్ల స్పందన
– వైఫల్యాలపట్ల స్పందన వ్యవహరించే తీరు
– స్నేహితులు, బంధువుల పట్ల స్పందిచే తీరు
– ఆర్ధిక వ్యవహరాల పట్ల వ్యవహరించే తీరు
– ఆగ్రహావేశాల నియంత్రణ.
వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిర్ధారించే అంశాల్లో ఇవి కొన్ని మాత్రమే. గొప్ప వ్యక్తిత్వం వున్నవారు జీవితంలో ఎదురయ్యే అవాంతరాలకు, అర్ధంలేని అంశాలకు భయపడరు. ధైర్యంగా ఎదుర్కొంటారు. నిలబడతారు. మంచి వ్యక్తిత్వం వున్న వారికి అన్నీ అనుకూలిస్తాయి. అందరి ఆదరాభిమానాలు లభిస్తాయి. వీరిలో వ్యతిరేక ధోరణి, వ్యతిరేక ఆలోచనలకు ఆస్కారం లేదు. అన్నీ సానుకూలతనే ఆశిస్తారు, ప్రదర్శిస్తారు. అందరితో సమానంగా ఉంటారు, అందరి దష్టి ఆకట్టుకుంటారు. అందుకే పెద్దలు అన్నింటా సానుకూల దక్పథం అలవర్చుకోవాలని అంటూవుంటారు. వ్యక్తిత్వం కొంతమందికి సహజంగానే ఉన్నత స్థాయిలో వుంటుంది. కొంతమంది అందుకు ప్రయత్నిస్తారు.

ఏమైనప్పటికీ, సమాజంలో మంచి వ్యక్తిగా అందరి మన్ననలూ అందుకో వాలంటే మంచి వ్యక్తిత్వం ఉండాలి. ఇది బాల్యంలోనే అలవడాలి. స్కూలు స్థాయిలోనే అందుకు బీజం పడాలి. చక్కగా చదువుకోవడం అందరితో కలివిడిగా వుండటం, స్నేహంగా వుండటం, సహాయసహకారాల్లో చురుగ్గా వుండటం, టీచర్లను సీనియర్లను గౌరవించడం అనే మంచి లక్షణాలు అలవర్చుకోవాలి. ఇందుకు తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లు సహకరించాలి. మార్గదర్శకులు కావాలి. పిల్లల్ని సన్మార్గంలో పెట్టడానికి, ముందడుగు వేయించడానికి స్ఫూర్తినీయాలి. మంచి వ్యక్తిత్వంతో జీవితంలో ఎదిగేందుకు సహకరించాలి. మంచి వ్యక్తిత్వం ఉన్నవారు దేనికీ భయపడరు. సమాజానికీ ఎంతో మేలు జరుగుతుంది.
డా|| హిప్నో పద్మా కమలాకర్‌, 9390044031 కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -