ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు ఉండే బ్యాలెన్స్‌డ్ డైట్ తినాలి. ఆహారంలో తగినంత పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ మన డైజెస్టివ్ సిస్టమ్ నుంచి ఎనర్జీ లెవెల్స్ వరకు ప్రతిదాన్ని ప్రభావితం చేస్తుంది, శరీరంలో చాలా సానుకూల మార్పులను తెస్తుంది. ఫైబర్ రిచ్ ఫుడ్స్ బెనిఫిట్స్ గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం…
ఫైబర్స్ రెండు రకాలు. ఒకటి కరిగేది, మరొకటి కరగనిది. కరిగే ఫైబర్, మన డైజెస్టివ్ సిస్టమ్‌లో ఒక రకమైన జిగురులాగా పనిచేస్తుంది. ఇది ఆహారం డైజెస్ట్ అయ్యే వేగాన్ని తగ్గిస్తుంది. దీంతో ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కరగని ఫైబర్, మలం వాల్యూమ్‌ను పెంచుతుంది. దీంతో మలం సులభంగా బయటకు వస్తుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. కరిగే ఫైబర్, శరీరం చక్కెరను శోషించుకునే వేగాన్ని తగ్గిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరం.
కొలెస్ట్రాల్‌కు చెక్
కరిగే ఫైబర్ కడుపులోని చెడు కొవ్వును (ూణూ కొలెస్ట్రాల్) తొలగిస్తుంది. ఇది పొట్టలోని చెడు కొవ్వులతో కలిసిపోయి, వాటిని బయటకు పంపిస్తుంది. ఫలితంగా గుండె సమస్యలు రావు. ఫైబర్ కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియాకు ఆహారంలా పనిచేస్తుంది. ఈ బ్యాక్టీరియా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఫైబర్ కడుపులోని హానికరమైన పదార్థాలను తొలగించి మలం సులభంగా బయటకు వెళ్లేలా చేస్తుంది. ఫలితంగా, కొలన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. ఈ రకమైన ఫైబర్ వోట్స్, బీన్స్, పప్పులు, పండ్లలో లభిస్తుంది. కరగని ఫైబర్ నీటిలో కరగదు. ఇది గోధుమలు, కూరగాయలు, గింజల్లో ఉంటుంది. ఈ ఫైబర్‌లో సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, లిగ్నిన్ వంటి మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి.
అయితే ఏ రకమైన ఫైబర్ అయినా సరే మితంగా తినాలి. ఒక్కసారిగా మరీ అతిగా తింటే బ్లోటింగ్, గ్యాస్, కడుపునొప్పి వంటి సమస్యలు రావచ్చు. అందుకే క్రమంగా ఫైబర్ ఇన్‌టెక్‌ను పెంచుతూ పోవాలి. పీచు పదార్థాలు తినేటప్పుడు చాలా వాటర్ తాగాలి. కొన్ని ఫైబర్-రిచ్ ఫుడ్స్‌లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరం కాల్షియం, జింక్, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలను గ్రహించకుండా అడ్డుకుంటుంది. ఈ సమస్యను తగ్గించడానికి, ఈ ఆహారాలను నానబెట్టి, మొలకెత్తించి లేదా పులియపెట్టి తినాలి.
గోధుమలు, పండ్లు, కూరగాయలు, పప్పులు, గింజలు, విత్తనాల వంటి హౌల్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి. ఈ ఆహారాల్లో ఫైబర్ సహజంగా లభిస్తుంది.
ఫైబర్ ఎలా తినాలంటే…
- Advertisement -
- Advertisement -