నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండల పరిధిలోని పలు గ్రామాలలో కోతుల బెడద రోజు రోజుకు పెరుగుతోంది. కోతులు గుం పులుగుంపులుగా బయలుదేరి కాలని లపై విరుచుకుపడుతున్నాయి. ఇళ్ల దుకాణాలలో తినుబండరాలు, వస్తువులను ఎత్తుకెళ్లడంతో పాటు పండ్ల చెట్లను ధ్వంసం చేస్తున్నాయి. ప్రజలపై దాడులకు దిగుతూ గాయ పరుస్తున్నాయి. కోతుల భయంతో ప్రజలు ఆందోళన చెందు తున్నారు. కోతుల నియంత్రణ కోసం అధికా రులు చర్యలు చేపట్టాలని గ్రామసు _లు డిమాండ్ చేస్తున్నారు.-ఇళ్లలోకి చొరబడి వస్తువుల అపహరణ..:అడవిలో ఆహారం లభించక గ్రామాల్లోకి అడవిలో జీవించాల్సిన కోతులు ఊర్లమీద పడుతున్నాయి. అటవీ ప్రాం తాలు రోజురోజుకు తగ్గి పోవడం వాటికి చొచ్చుకు వస్తున్నాయి. గుంపుల గుంపులుగా కాలనీల్లో సంచరిస్తూ వీరంగం సృష్టిస్తున్నాయి. ఇళ్లలో తయారు చేసుకున్న భోజనలతోపాటు పప్పు దినుసులు పట్టుకెలుతున్నాయి.
తీవ్రవైన కోతుల బెడద కారణంగా కిరణా షాపులు, పండ్ల దుకాణదారులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షాపులోని వస్తువులకు రక్షణగా జాలీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కోతుల బెడతతో ఇల్లు ధ్వంసం అ వుతున్నాయి. అరుబయట ఎండబెట్టిన పప్పు దినుసులు ఇతర ఆహర పదర్థాలను సైతం వదలటంలేదు. ఇళ్లలో ఉన్న, జామ, బొప్పాయి ఇతర పండ్ల చెట్లు, కూరగాయాల చెట్లను సైతం ధ్వంసం వదలకుండచేస్తున్నాయి.భయందోళనలో ప్రజలు..:కోతుల బెడద రోజురోజుకు ఎక్కువ కావడంతో ప్రజలు భయందో “ళనలకు గురవుతున్నారు. ఇళ్లలో చొర బడి వీరంగం సృష్టిస్తున్న కోతులను తరి మే ప్రయత్నంలో అవి ప్రజలపై దాడ లకు దిగుతున్నాయి. కొన్ని సందర్భాల లో కోతి కాటుకు గురై ఆసుప త్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉత్పన్న మవుతున్నాయి. మిద్దెల మీద గుంపుల ఎగుంపులుగా ఒకచోట చేరి వచ్చిపోయే వారిపై పైపైకి వచ్చి భవ భ్రాంతులకు గురిచేస్తు న్నాయి.
కోతుల బెడద తీవ్రం కావడంతో కొంతమంది టపాసులు, పెద్ద శబ్దాలు చేసి వాటిని తరి మి వేస్తున్నారు.నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలిమండలంలో కోతులనియంత్రణ కోసం అధికారులు తగిన చర్యలు చేప ట్టాలని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు. కోతులను బంది ంచి అటవీ అటవీప్రాంతాలకు తరలిం చాలని డిమాండ్ చేస్తున్నారు. కోతుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని వాటి నియంత్రణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించి కోతుల బారినుంచి రక్షణ కల్పించాలని పలుఎ రు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు దృష్టి సారించి కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు. వరి పొలాలను పత్తి పంటలను ఆకుకూరలు కూరగాయ తోటలు కూడా వదలడం లేదు వానరాల ఆగడాల మూలంగా ఆయా గ్రామాల ప్ర జ లు పడుతున్న ఇబ్బందులు వర్ణాతీ తం.. అటవీ ప్రాంత గ్రామాల్లో చూద్దిమన్న ఒక కోతి కూడా కనిపించడం లేదు మైదాన ప్రాంత గ్రామాల్లో తిష్ట వేసుకుని కూర్చని ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
పాద చారుల వెంటపడి దాడి చేసి తీవ్ర గా యాల పాలు చేస్తున్నాయి. గాయాల పాలైన వారు ఆస్పత్రులకు వెళ్లి వ్యాక్సి న్స్ వేయించుకుంటున్నారు. చిన్నపి ల్లలు దారి వెంట స్కూలుకు వెళ్లాలన్న పెద్దలు కూడా బయటకు వెళ్లాలన్నా కోతుల గుంపులు చూసి ఒక్కింత వనికి పోతున్నారు.. కోతులకు తోడుగా కుక్కలు కూడా ఇదే పందాలు ఎంచుకు న్నాయి. దారి వెంట వెళ్లే వారిని మరి వెంబడించి కరుస్తున్నాయి ద్విచక్ర వాహనాలకు అడ్డు తిరిగి వారు కిందపడే వరకు వదిలిపెట్టడం లేదు. గ్రామాల్లో కోతుల కుక్కల బెడదను నియంత్రిం చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధి కారులు ఈ దిశగా ఆలోచన చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.