- Advertisement -
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
గద్వాల పట్టణం గంజిపేట కాలనీ మీదుగా చెన్నుగొనిపల్లెకు వెళ్లేదారి గుంతలమయంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ఆ రోడ్డు చెనుగొనిపల్లె గ్రామ ప్రజలకు చుక్కలు చూపిస్తుంది. మున్సిపల్ అధికారులు రోడ్డును తవ్వి వదిలేశారు, కనీసం నెల రోజులు దాటిపోయిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గుంతలు పూర్చాలని చెనుగొనిపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.
- Advertisement -



