నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
పెద్ద కొడప్ గల్ మండలంలోని చవని తాండ నుండి మన్సూరం తాండ గేటుకు వెళ్లే రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలు ఏర్పడి నీళ్లు నిండిపోయాయి. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గత వారం రోజుల నుండి ఎడతెరిపిలేకుండ భారీ వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయి అద్వాన స్థితికి చెరింది. ఈ రోడ్డు గుండా ఇతర గ్రామాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తారు. గుంతలో మోకాలోతు నీరు నిలచి ప్రయాణకులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రోడ్డు గుండా ప్రయాణం చెయ్యాలంటేనే జనాలు జంకుతున్నారు. దింతో బిచ్కుంద, బాన్సువాడకు వెళ్లే ప్రయాణికులకు దూరా భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజుల క్రితం కంగ్టి మండలంలోని ఎడ్ల రేగడి తాండ జ్వాల ముఖీ మాత మందిరంలో దసరా పండుగ హమ్ ఉత్సవాలు జరిగింది. ఈ ఉత్సవాలకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహారాష్ట్ర నుండీ భారీగా భక్తులు రాగ ఈ రోడ్డు గుండా వెళ్లిన భక్తులు రోడ్డు గుండా భారీ గుంతలు ఏర్పడి నీళ్లతో నిండిపోగ వాహన దారుల అదుపు తప్పి అష్టకష్టాలు పడ్డారు. దింతో అధికారాలు నాయకులు స్పందించి మొరం వేసి మరమ్మతులు చెయ్యలని కోరుతున్నారు.
రోడ్డు ఇలా ప్రయాణం ఎలానీళ్లతో నిండిన రోడ్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES