Wednesday, February 4, 2026
E-PAPER
Homeజాతీయంఅకస్మాత్తుగా ఎలా ఖరారైంది?

అకస్మాత్తుగా ఎలా ఖరారైంది?

- Advertisement -

రైతుల కష్టాన్ని మోడీ అమ్మేశారు : రాహుల్‌ గాంధీ
న్యూఢిల్లీ:
వాణిజ్య ఒప్పందం విషయంలో అమెరికా ఒత్తిడికి ప్రధాని మోదీ లొంగిపోయారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఈ ఒప్పందం ద్వారా రైతుల కష్టాన్ని అమ్మేశారని విమర్శించారు. ”దాదాపు నాలుగు నెలలుగా నిలిచిపోయిన వాణిజ్య ఒప్పందం సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా ఎందుకు ఖరారైందో మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో ప్రధానిపై తీవ్ర ఒత్తిడి ఉంది. అమెరికాలో వ్యాపారవేత్త అదానీపై కేసు వంటి వ్యవహారాలు దీనికి కారణం. వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రధాని రాజీ పడ్డారు. రైతుల కష్టాన్ని, మొత్తం దేశాన్నే అమ్మేశారు” అని రాహుల్‌ విమర్శలు చేశారు. భారత సైన్యం మాజీ అధిపతి ఎం.ఎం.నరవణె రాసిన ఆత్మకథలోని అంశాలపై లోక్‌సభలో రెండో రోజూ గందరగోళం కొనసాగింది. ప్రభుత్వం తనను మాట్లాడనివ్వడం లేదని రాహుల్‌ ఆరోపించారు. చరిత్రలో మొదటిసారి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడేందుకు ఓ ప్రతిపక్ష నేతకు అనుమతి ఇవ్వలేదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -