Sunday, October 19, 2025
E-PAPER
Homeఆటలుహెచ్‌పిఎల్‌ విజేత సూపర్‌ టైటాన్స్‌

హెచ్‌పిఎల్‌ విజేత సూపర్‌ టైటాన్స్‌

- Advertisement -

హైదరాబాద్‌ : 2025 హెచ్‌పీఎల్‌ చాంపియన్స్‌ ట్రోఫీలో సూపర్‌ టైటాన్స్‌ విజేతగా నిలిచింది. శనివారం విజయానంద్‌ గ్రౌండ్‌లో జరిగిన ఫైనల్లో రెకాన్‌ రేంజర్స్‌పై సూపర్‌ టైటాన్స్‌ 20 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌ టైటాన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. ఎన్‌. కార్తీక్‌ (47 బంతుల్లో 49 పరుగులు), అనిల్‌ కుమార్‌ (18 బంతుల్లో 39 పరుగులు) రాణించారు. ఛేదనలో రెకాన్‌ రేంజర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 132 పరుగులే చేసింది. సూపర్‌ టైటాన్స్‌ ఆల్‌రౌండర్‌ ధ్రువ్‌ వర్దన్‌ రెడ్డి (24 బంతుల్లో 26 పరుగులు, 1/30) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలువగా.. అక్షర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’ అవార్డు అందుకున్నాడు. విజేత, రన్నరప్‌ జట్లకు మామ్స్‌ హాస్పిటల్స్‌ చైర్మెన్‌ నయన్‌ రాజ్‌, నిర్వాహకులు యూసుఫ్‌ హుస్సేన్‌ ట్రోఫీలు, మెడల్స్‌ అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -