Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే తోట సమక్షంలో కాంగ్రెస్ లో భారీ చేరికలు..

ఎమ్మెల్యే తోట సమక్షంలో కాంగ్రెస్ లో భారీ చేరికలు..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
ప్రజా ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు, మరియు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జుక్కల్ నియోజకవర్గంలో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరుగుతూనే ఉన్నాయని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. అందులో భాగంగానే శనివారం నాడు జుక్కల్ మండలం హంగర్గా గ్రామంలో బీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీల కు చెందిన పలువురు నాయకులు,కార్యకర్తలు, మహిళలు మరియు గ్రామస్థులు సుమారు 300 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  నాయకత్వంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని, వారి నాయకత్వాన్ని బలపర్చేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చేరినవారు చెప్పారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.,హంగర్గా గ్రామ అభివృద్ధి కోసం గ్రామస్థులు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గత పదిహేనేళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన హన్మంత్ షిండే నియోజకవర్గ అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోకుండా, కేవలం తన స్వలాభం మాత్రమే చూసుకున్నాడని, నమ్మి ఓట్లేసిన ప్రజలను నిండా మోసం చేసాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు మోసపోయి గోస పడ్డది చాలు, ఇక ఆలోచనతో అభివృద్ధి వైపు అడుగులు వేద్దామని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుండి జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే నిరంతరం పరితపిస్తున్నానని అన్నారు. జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పని చేస్తున్నానని చెప్పారు.

అభివృద్ధితో పాటు నియోజకవర్గంలో ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, సంక్షేమ పథకాలు అందరికీ చేరవేస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసమే పని చేస్తుందని, ప్రతీ పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad