Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు

తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
బిర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ సీనియర్ నాయకులు రుద్రూర్ మండల వాస్తవ్యులు షేక్ మతిన్ కి, తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ దేగాం యాదగౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. షేక్ మతిన్ తన అనుచర గలంతో చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీలో అంకితభావంతో పనిచేసి, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని దేగం యాద గౌడ్ దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్, అంబిక సత్యనారాయణ,బొబ్బ నరసింహ రావు, శంకర్ ముదిరాజ్, ఎల్లంకీ పురుషోత్తం, అంబేం సాయిలు, టికె బాబు, అంగర్గ సాయిలు, దత్తు, శంకర్, అశోక్, స్వామి, గంగోనే రాజేశ్వర్, సర్ఫరాజ్, నాగేశ్వర రావు, ప్రభాకర్, రవి, నరసయ్య, రాములు, రషీదా, లక్ష్మీ యాదవ్, చిన్నమ్మ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad