35 సంస్థలతో ఎంఓయులకు నిర్ణయం
రెన్యూ పవర్ సంస్థతో రూ.62 వేల కోట్లకు ఒప్పందం
విశాఖపట్నం : ప్రతిష్టాత్మకంగా నిర్వహి స్తున్న సిఐఐ సదస్సుకు ఒక్క రోజు ముందే వివిధ సంస్థలతో చర్చల ప్రక్రియను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఒప్పందాలు కుదుర్చుకుంది. బుధవారం సాయంత్రానికే విశాఖపట్నం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ వెంటనే స్వయంగా చర్చల్లో భాగస్వాములయ్యారు. గురువారమంతా ఇదే ప్రక్రియ సాగింది. ఫలితంగా 35 సంస్థలతో ఎంఓయులు కుదుర్చుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్రప్రభుత్వ అధికారులు ప్రకటించారు. గురువారం సాయంత్రానికే వీటిలో ఆరు సంస్థలతో ఒప్పందాల ప్రక్రియ పూరయ్యింది. మిగిలిన సంస్థలతో కూడా రాత్రిలోగా ఒప్పందాలను పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించారు.
వీటిలో సిఆర్‌డిఎకు సంబంధిరచి ఎనిమిది, ఇరధనరంగంలో ఐదు, ఫుడ్ ప్రాసెసిరగ్‌లో నాలుగు, మౌళికాభివృద్ధి రంగంలో మూడు, పరిశ్రమల రంగంలో తొమ్మిది ఒప్పరదాలు ఉన్నాయి. రెన్యూ పవర్ సంస్థతో రూ.62 వేల కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేసుకున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటిరచిరది. మురదస్తు ఒప్పరదాల్లో ఇదే పెద్దదని అధికారులు చెబుతున్నారు. అలాగే ఇ జౌల్ సంస్థతో మరో రూ.19 వేల కోట్ల పెట్టుబడిపై ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే తైవాన్ దేశానికి చెరదిన ప్రయివేటు ఇరడిస్టియమ్ పార్క్‌తో రూ.1200 కోట్ల, కోరమారడల్ సంస్థతో రెరడు వేల కోట్లు, హీరో ఫ్యూచర్ ఎనర్జీ సంస్థతో 15 వేల కోట్లతో, జూల్ సంస్థతో రూ.1500 కోట్లతో ఒప్పరదాలు జరిగాయి.
రెన్యూతో బాబు, లోకేష్ చర్చలు
పవర్ సెక్టార్‌లో కీలకమైన రెన్యూ సంస్థతో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటి శాఖ మరత్రి లోకేష్ చర్చిరచారు. రాష్ట్రంలో రూ.82 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేరదుకు ఆ సంస్థ సిఇఒ సుమంత్ సిన్హా సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆ వెంటనే ఇరదుకు సంబంధిరచి రాష్ట్రప్రభుత్వంతో ఒప్పరదం కూడా చేసుకున్నారు. తక్కువ ధరకే విద్యుత్‌ను విని యోగదారులకు అరదిరచడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా చంద్రబాబు సిన్హాకు వివరించారు.
గూగుల్ డేటా విశాఖ వస్తున్న నేపథ్యంలో అరదుకు అవసరమైన విద్యుత్ డిమారడ్‌ను తీర్చేందుకు తాము సిద్దమని సిన్హా ముఖ్యమంత్రికి చెప్పారు. అనంతరం మీడియా ప్రతినిధులతో చంద్రబాబు, లోకేష్ మాట్లాడుతూ రెన్యూ పవర్ గతంలో రాష్ట్రం నురచి వెళ్లిపోయిందని, తిరిగి ఇప్పుడు వస్తున్నదని చెప్పారు. రెన్యూ పవర్ ఆధ్వర్యాన అనంతపురంలో దేశంలోనే అతి పెద్దదైన 2.8 గిగావాట్ల విద్యుత్ ప్లారట్ ఏర్పాటుచేయాలని నిర్ణయిరచిరది. రైతులతో సోలార్ ప్లారట్లు ఏర్పాటుచేసే ఆలోచన కూడా రెన్యూ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనిపైనా సిన్హాతో ముఖ్యమంత్రి చర్చించారు.
4 గిగావాట్లకు ఒప్పరదం
విద్యుత్ రంగంలోనే మరో నాలుగు గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థతో ఒప్పరదం కుదుర్చుకున్నారు. అనకాపల్లిలో టారు పార్కు ఏర్పాటుచేసేరదుకు పాల్స్ ఫ్లష్ సంస్థ, రామాయపట్నం వద్ద ఫర్నీచర్ క్లస్టర్ సిటీని ఏర్పాటుచేసేరదుకు స్వీడన్‌కు చెరదిన జూల్ గ్రూప్ సంస్థలు ముందుకు వచ్చాయి.
సిఐఐ సదస్సుకు ఒక్కరోజు ముందే..భారీగా ఒప్పందాలు
- Advertisement -
- Advertisement -


