– బతుకమ్మ ఆవిష్కరణలో మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్
– అంబేడ్కర్ విగ్రహం వద్ద భారీ బతుకమ్మ ఏర్పాటు
నవతెలంగాణ – బెజ్జంకి
పూలను దేవుడిగా కొలువడం తెలంగాణ ప్రత్యేకతని.. బతుకమ్మ పండుగ ప్రత్యేకతను చాటేల భారీ ‘బతుకమ్మ’ రూపొందించి ఆవిష్కరించుకోవడం మహాద్భుతమని మాజీ ఎంపీపీ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రానికి చెందిన కవ్వంపల్లి సరోజన రామంచంద్రం దంపతులు మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య కృషితో రూపొందించిన భారీ బతుకమ్మను ఆదివారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.బతుకమ్మ ప్రత్యేకతను చాటేల భారీ బతుకమ్మను రూపొందించి ఏర్పాటు చేసుకోవడం ఆనందనీయమని దామోదర్ సంతోషం వ్యక్తం చేశారు.బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లింగాల శ్రీనివాస్,మాజీ ఉప సర్పంచ్ బండి వేణు,నాయకులు నారాయణ రెడ్డి,రొడ్డ మల్లేశం,స్థానికులు పాల్గొన్నారు.
5 పీట్ల భారీ బతుకమ్మ..
సుమారు 5 పీట్ల భారీ బతుకమ్మను రూ. 3 వేల వ్యయంతో నాలుగు రోజుల పాటు శ్రమించి రూపొందించినట్టు కవ్వంపల్లి సరోజన-రామచంద్రం దంపతులు తెలిపారు.మండలంలో భారీ బతుకమ్మను రుపొదించి ఏర్పాటుచేయడం సంతోషకరమని దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.