Saturday, February 14, 2026
E-PAPER
Homeబీజినెస్విదేశీ మారకం నిల్వల్లో భారీ పతనం

విదేశీ మారకం నిల్వల్లో భారీ పతనం

- Advertisement -

వారంలో 6.7 బిలియన్‌ డాలర్ల తగ్గుదల : ఆర్‌బీఐ వెల్లడి
ముంబయి :
భారతదేశ విదేశీ మారకం నిల్వల్లో మరోమారు భారీ తగ్గుదల చోటుచేసుకుంది. ఒక్కవారం లోనే దాదాపు 6.7 బిలియన్‌ డాలర్లు కరిగిపోయాయి. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.60వేల కోట్లకు సమానం. ఫిబ్రవరి 6తో ముగిసిన వారంలో ఏకంగా 6.71 బిలియన్‌ డాలర్లు తగ్గి 717.6 బిలియన్లకు పరిమితమయ్యాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. ఇది ఇంతక్రితం వారంలో నమోదైన 723.8 బిలియన్లతో పోల్చి తే భారీ తగ్గుదలను సూచి స్తుందని వెల్లడించింది. అయినప్పటికీ ఆర్‌బీఐ వద్ద 11 నెలల దిగుబడులకు సరిపడ నిల్వలు ఉన్నాయని పేర్కొం ది. అదే సమయంలో బంగారం నిల్వలు 14.2 బిలియన్లు తగ్గి 123.47 బిలియన్లకు చేరాయి. స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌) 132 మిలియన్లు తగ్గి 18.82 బిలియన్‌ డాలర్లకు తగ్గాయని వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌)లో భారతదేశ నిల్వలు 32 మిలియన్‌ డాలర్లు క్షీణించి 4,71 బిలియన్లుగా చోటుచేసుకున్నాయి. భారత విదేశీ మారకం నిల్వలు తగ్గితే ప్రధానంగా రూపాయిపై ఒత్తిడి పెరగనుంది. ఇది విదేశీ చెల్లింపులపై తీవ్ర ఒత్తిడిని పెంచనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -