మెరుగు పడనున్న ఇంటర్ విద్యార్ధుల సౌకర్యాలు..
అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మహర్ధశ..
నవతెలంగాణ – అశ్వారావుపేట
పాలకులను బట్టి పరిపాలన,అధికారులను బట్టి పధకాలను అమలు చేస్తుంటారు.కాంగ్రెస్ ఆద్వర్యంలో, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ప్రభుత్వ విద్యపై పర్యవేక్షణ అధికం అయింది. దీంతో నిధులు సైతం విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్,కమీషనర్ క్రిష్ణ ఆదిత్య ఇటీవల ప్రభుత్వం జూనియర్ కళాశాలల మరమ్మత్తులకు,సౌకర్యాలు కల్పించడానికి భారీ ఎత్తున నిధులు మంజూరు.
ఈ నేపధ్యంలో స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సైతం ఉపాద్యాయ వృత్తి నుండే ప్రజాప్రతినిధిగా రావడంతో విద్యా వైద్యం సేద్యం పై దృష్టి సారించడం తో అశ్వారావుపేట నియోజక వర్గంలోని అశ్వారావుపేట,ములకలపల్లి మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఆయన చొరవతో అశ్వారావుపేట కళాశాలకు రూ.9.15 లక్షలు,ములకలపల్లి కళాశాలకు రూ.39 లక్షలు నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ల పర్యవేక్షణలో కళాశాలల్లో పునరుద్దరణ పనులు చేయనున్నారు.
అశ్వారావుపేట కళాశాల 2013 మంజూరు అయి 2015 లో నూతన భవనం నిర్మించి ప్రారంభించిన నాటి నుండి ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కావడం తో సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ప్రిన్సిపాల్ అల్లు అనిత నవతెలంగాణ తో మాట్లాడారు. ఈ ఏడాది మొదటి సంవత్సరం 118,రెండో సంవత్సరం 55 మంది విద్యార్ధులు కళాశాలలో చదువుతున్నారని,ఇప్పటికే కళాశాలలోని 13 గదుల్లో 13 చొప్పున సీసీ కెమెరాలు,ఫైర్ సేఫ్టీ పరికరాలు అమర్చారు,ఫిజిక్ వాలా పర్యవేక్షణలో ఎంసెట్,క్లాప్( కోచింగ్,కామన్ లా అడ్మిషన్ టెస్ట్) కోసం శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు.