భారీగా పెరిగిన కూరగాయల ధరలు..

నవతెలంగాణ – హైదరాబాద్: గత రెండు వారాలుగా కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుత ధరలు చూస్తుంటే. కూరగాయల ధరలు రోజురోజుకీ పెరిగిపోతుండటంతో సామాన్యుడి రోజు భారంగా గడుస్తోంది. ఇది మన దేశంలో.. అయితే బ్రిటన్‌ తో పోల్చుకుంటే మన దేశంలో కూరగాలయ ధరలు కాస్త బెటరే అనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ కూరగాయల ధరలు ఏకంగా వేలల్లో పలుకుతున్నాయి. అవును, బ్రిటన్‌లోని భారతీయ స్టోర్స్‌లో.. కాకరకాయలు కేజీ రూ.1000, బెండకాయలు కేజీ రూ.650, ఆరు ఆల్ఫోన్సో మామిడికాయలు రూ.2,400లు పలుకుతున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఢిల్లీకి చెందిన చావి అగర్వాల్ ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్నారు. ఇండియన్‌ స్టోర్స్‌లో ఉన్న ధరలు చూసి, ఆమె ఆశ్చర్యపోయారు. ఒక స్టోర్‌లో సరుకుల రేట్లు చూపిస్తూ ఇన్‌స్టాగ్రాంలో ఒక వీడియోను పోస్టు చేశారు.

Spread the love