Wednesday, November 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమావోయిస్టుల భారీ డంపు స్వాధీనం

మావోయిస్టుల భారీ డంపు స్వాధీనం

- Advertisement -

– 17 రైఫిళ్లు, నిర్మాణ సామగ్రి స్వాధీనం : వివరాలు వెల్లడించిన సుకుమా జిల్లా ఎస్పీ
నవతెలంగాణ-చర్ల

సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా భద్రతా దళాలు గోమ్‌గూడ దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధ కర్మాగారాన్ని కనుగొని ధ్వంసం చేసినట్టు సుకుమా జిల్లా ఎస్పీ కిరణ్‌ చౌహాన్‌ తెలిపారు. డీఆర్‌జీ బృందం ఈ ఆపరేషన్‌లో ప్రత్యేక పాత్ర పోషించిందని తెలిపారు. మంగళవారం ఎస్పీ కిరణ్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. సుక్మా జిల్లా డీఆర్‌జీ బృందం, నిర్దిష్ట నిఘా సమాచారం మేరకు.. గోమ్‌గూడ దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు నిర్వహిస్తున్న అక్రమ ఆయుధ తయారీ కర్మాగారాన్ని కనుగొని ధ్వంసం చేసినట్టు తెలిపారు. 17 రైఫిల్స్‌, ఆయుధాల తయారీ పరికరాలు, యంత్రాలు, తుపాకీ భాగాలు, పెద్ద మొత్తంలో ఆయుధాల తయారీ సామగ్రిని సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ఈ ప్రాంతంలో సాయుధ కార్యకలాపాలను పెంచే లక్ష్యంతో మావోయిస్టులు ఈ కర్మాగారాన్ని నిర్వహిస్తున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. గత సంవత్సరంలో 545 మంది మావోయిస్టులు లొంగిపోయి ప్రధాన స్రవంతిలో చేరారని, 454 మంది మావోయిస్టులు అరెస్టు అయ్యారని, సుమారు 64 మంది వివిధ ఎన్‌కౌంటర్లలో మరణించారని తెలిపారు. మిగిలిన మావోయిస్టులపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుందన్నారు. మిగిలిన మావోయిస్టులంతా ప్రధాన స్రవంతి కలవాలని విజ్ఞప్తి చేస్తున్నామని, లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు పూర్తి భద్రత, గౌరవం ఇవ్వబడుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -