Wednesday, October 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకంకోల్ టోల్ ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత

కంకోల్ టోల్ ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత

- Advertisement -

దాని విలువ దాదాపుగా రూ. 1 కోటి ముపై లక్షల పైనే
నిందితుల వద్ద రూ.17,500 నగదు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం
నిందితుల వద్ద నాలుగు స్వాధీనం
రెండు వాహనాలు సీజ్
నవతెలంగాణ – మునిపల్లి

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్ టోల్ ప్లాజా వద్ద మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఒక బ్రిజ కారులో, మరొక వాహనం మహీంద్రా బొలెరో కారులో రూ.1 కోటి ముపై లక్షల విలువగల ఎండు గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించామని మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టామని అన్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్ర వైపు వెళుతున్న ఒక బీజా కారు, ఆరోవాహనం మహేంద్ర బొలెరో వాహనాలను ఆపి తనిఖీ చేశామని తెలిపారు. అందులో 130 ప్యాకెట్లుగా, 260 కిలోల నిషేధిత ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

సుమారు దాని విలువ కోటి ముపై లక్షలు ఉంటుందని, నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద రూ.17,500 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ సందర్బంగా నిందితులను విచారించగా ఒరిస్సా రాష్ట్రం చంద్రగిరి నుండి తీసుకువెళ్లి మహారాష్ట్రలోని మలేగాం ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు తెలిపారని వివరించారు. నిందితులు పిటారా పరిచ్చా, డేవిడ్ పాల్, ధరంచంద్ పైక్, , సంజీవ్ కుమార్ నాయక్. ఈ నలుగురు వ్యక్తులు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించామని, వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలలో మాదక ద్రవ్యాల రవాణాపై జిల్లా పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపడం జరుగుతుందని ఎవరైనా గంజాయి లేదా ఇతర మారకద్రవ్యాలను సాగు సాగు కానీ సరఫరా కాని చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఇట్టి కేసు చేదనలో కీలకంగా వ్యవహరించిన మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్, ఎస్ – న్యాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, క్లూస్ టీం సిబ్బందిని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ వారిని అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -