Saturday, November 22, 2025
E-PAPER
Homeజిల్లాలుబిజ్జల్ వాడీ వ్యవసాయ పొలంలో భారీ కొండచిలువ..

బిజ్జల్ వాడీ వ్యవసాయ పొలంలో భారీ కొండచిలువ..

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ 
మండలంలోని బిజ్జల్ వాడి గ్రామంలోని ఒక వ్యవసాయ రైతు భూమిలో నీటిని పంపించేసే పైప్ లైన్ లో భారీ కొండచిలువ దాక్కొని ఉంది. శనివారం సాయంత్రం నీటిని వదిలేందుకు సంబంధిత పైప్ లైన్ ద్వారా వ్యవసాయ భూమికి నీరు పెట్టేందుకు పైపులు జమ చేస్తున్న క్రమంలో బాగా బరువుగా కనిపించడంతో రైతుకు అనుమానం వచ్చింది. వెంటనే పైపులోకి తొంగి చూశాడు. అంతే.. అందులో భారీ కొండచిలువ కనిపించింది. దీంతో రైతు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. భయంతో పక్కనే ఉన్న రైతును పిలిచి, విషయం చెప్పాడు. అప్రమత్తమైన చుట్టుపక్కల రైతులు పామును బయటకు తీసేందుకు ప్రయత్నించి చివరికి సఫలమయ్యారు. ఈ క్రమంలో వారంతా కలిసి దానిని హతమార్చారు. సుమారుగా రెండున్నర మీటర్ల పొడవు, 40 నుండి 50 కిలోల బరువుతో ఉందని రైతులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -