Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవంబర్ 1న హైదరాబాద్ లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ..

నవంబర్ 1న హైదరాబాద్ లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ..

- Advertisement -

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ..
నవతెలంగాణ – మిర్యాలగూడ 

అత్యున్నత న్యాయవ్యవస్థైన  సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై దాడి జరిగితే ఇప్పటికీ కేసులు  నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ నవంబర్ 1 న ఛలో హైదరాబాద్ పేరుతో లక్షలాది మందితో దళితుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ తెలిపారు. బుధవారం పట్టణంలో ఏంఅర్పిఎస్ పట్టణ  కార్యవర్గ సమావేశం పట్టణ అధ్యక్షులు ఉబ్బపల్లి రాజు మాదిగ అధ్యక్షతన ఆర్యవైశ్య భవన్ లో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ” సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ స్థానంలో ఉన్న దళితుడికే రక్షణ లేకపోతే దేశంలో సామాన్య దళితులకు రక్షణ ఎలా ఉంటుందని అన్నారు. ఈ దాడి జరిగి 12 రోజుల గడుస్తున్నా ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడం దారుణమని అన్నారు.

జస్టిస్ గవాయ్ స్థానంలో ఉన్నత కులాలకు చెందిన జడ్జీ ఉంటే కేసు నమోదు చేయడంలో ఇలా నిర్లక్ష్యం చేసి ఉండే వారా? అని ప్రశ్నించారు.అందుకే జస్టిస్ బిఆర్ గవాయ్ మీద జరిగిన దాడి దళితులపైన జరిగిన దాడిగా చూస్తున్నామని అన్నారు. దాడి ఘటనను నిరసిస్తూ జాతీయ స్థాయిలో దళితుల ఆత్మగౌరవ పోరాటం చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు దైద సత్యం మాదిగ,  సందాల శంభయ్య, మోహన్,  దైద  శ్రీనివాస్ ఏల్తూరి అఖిల్, ఉబ్బపల్లి పేద్ద ఎల్లయ్య, దైద వెంకటేశ్వర్లు బొంగరాల నాగయ్య, దైద రవి,  ఉబ్బపల్లి శంకర్  నందిపాటి నరేష్ , దైద గోపి, దైద శ్రీకాంత్, కత్తుల అవినాష్, దైద సాయినాథ్, ధైద శరత్ కుమార్, ఇరుగు యశ్వంత్, నాని, సాయి కొత్తపల్లి గణేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -